close

తాజా వార్తలు

ముత్తాత పేరుతో పార్టీ పెట్టి.. కింగ్‌ మేకర్‌గా మారి..

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: దుశ్యంత్‌ చౌటాలా... ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు.. హరియాణాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటంతో అందరి దృష్టి దుశ్యంత్‌ చౌటాలాపై మళ్లింది.  మొత్తం 90 సీట్లున్న హరియాణాలో హంగ్‌ అసెంబ్లీ ఏర్పడటంతో  చౌటాలా నేతృత్వంలోని జననాయక్‌ జనతా పార్టీ మద్దతు కోసం భాజపాతో పాటు కాంగ్రెస్‌ ఎదురుచూస్తోంది.

చిన్నవయసులోనే ఎంపీగా ఎన్నికై..

2014 లోక్‌సభ ఎన్నికల్లో చౌటాలా ఐఎన్‌ఎల్‌డీ తరఫున హిసార్‌ నుంచి పోటీచేసి గెలుపొందారు. అప్పటికి అతని వయసు 26 ఏళ్లే. ఐఎన్‌ఎల్‌డీ అగ్రనేత ఓంప్రకాశ్‌ చౌటాలాకు దుష్యంత్‌ మనవడు. ఉద్యోగ కుంభకోణం కేసులో హరియాణా మాజీ సీఎం ఓంప్రకాశ్‌ చౌటాలాతో పాటు ఆయన కుమారుడు అజయ్‌చౌటాలాకు న్యాయస్థానం కారాగారశిక్ష విధించింది. అజయ్‌చౌటాలా కుమారులు దుష్యంత్‌ చౌటాలాతో పాటు ఆయన సోదరుడు దిగ్విజయ్‌, బాబాయ్‌ అభయ్‌ సింగ్‌ చౌటాలాలు ఐఎన్‌ఎల్‌డీ ఆధిపత్యం కోసం పోరాడారు. దుశ్యంత్‌తో పాటు దిగ్విజయ్‌ను ఐఎన్‌ఎల్‌డీ నుంచి బహిష్కరించడంతో దుశ్యంత్‌ 2018లో జేజేపీ పార్టీని నెలకొల్పారు.

ముత్తాత పేరుతో...

మాజీ ఉప ప్రధాని, దివంగత దేవీలాల్‌కు హరియాణా రాజకీయాల్లో గట్టిపట్టుండేది. 1996లో ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ను నెలకొల్పారు. ఆయన తదనంతరం పార్టీ పగ్గాలను ఆయన పెద్దకుమారుడు ఓం ప్రకాశ్‌ చౌటాలా అందుకున్నారు. అనంతరం జైలుకు వెళ్లడంతో ఆయన కుమారుల మధ్య ఆధిపత్య పోరు నెలకొంది. పెద్దకుమారుడు అజయ్‌ సైతం శిక్షకు గురయ్యారు. పార్టీ నుంచి దుశ్యంత్‌ను బహిష్కరించడంతో 2018లో జేజేపీ పక్షాన్ని స్థాపించారు. ఆయన ముత్తాత చౌదరి దేవీలాల్‌ను  ప్రజలు జననాయక్‌ అని పిలిచేవారు. ఆయన పేరుతోనే పార్టీని స్థాపించారు. 

జాట్ల ప్రాబల్యం..

హరియాణాలో జాట్ల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. చౌటాలా కుటుంబంతో పాటు కాంగ్రెస్‌నేత భూపిందర్‌సింగ్ హుడా అదే వర్గానికి చెందినవారు. 2014 ఎన్నికల్లో జాటేతర సీఎంగా మనోహర్‌ ఖట్టర్‌ పగ్గాలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో జాట్లు మళ్లీ ఏకమై దుశ్యంత్‌కు మద్దతు ఇవ్వడంతో జేజేపీ కీలకంగా మారింది.
 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.