close

తాజా వార్తలు

40వేల వజ్రాలు పొదిగిన టాయ్‌లెట్!

ఇంటర్నెట్‌డెస్క్‌: వజ్రాలతో పొదిగిన బంగారపు టాయ్‌లెట్‌ ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చైనాలోని షాంఘైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. దీని ప్రత్యేకతలు చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ టాయ్‌లెట్‌ పైభాగంలో కూర్చోడానికి దాదాపు 40వేలకు పైగా వజ్రాలతో(334.68 క్యారెట్ల) బుల్లెట్‌ ప్రూఫ్‌ సీటును తయారు చేశారు. దీని విలువ సుమారు రూ.9కోట్ల(1.3మిలియన్‌ డాలర్లు) ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ టాయ్‌లెట్‌ను హాంగ్‌కాంగ్‌కు చెందిన కోరోనెట్‌ అనే నగల దుకాణ యజమాని ఆరోన్‌ షమ్‌ రూపొందించారు. ఇది కొనుగోలుదారులను ఆకర్షించిందా అని ఆరోన్‌ షమ్‌ను అడగ్గా చెప్పేందుకు ఆయన నిరాకరించారు. అంతేకాకుండా దాన్ని అమ్మకానికి ఉంచలేదని కేవలం ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు. ఈ టాయ్‌లెట్‌ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను బాగా ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో పలువురు దీన్ని తయారు చేసినందుకు ప్రశంసలు కురిపిస్తుంటే.. మరికొందరు విమర్శలు చేస్తున్నారు. 

 

 

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.