
తాజా వార్తలు
1. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన
మహారాష్ట్రలో మలుపుల రాజకీయానికి తెరపడింది. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమలు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అంతకుముందు ‘మహా’లో రాష్ట్రపతి పాలన విధించే అంశానికి కేంద్ర కేబినెట్ ప్రతిపాదించింది. ఎన్సీపీ మరింత గడువు కోరడంతో రాష్ట్రంలో ఇక రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం లేదనే నిర్ణయానికి వచ్చిన గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ.. రాష్ట్రపతి పాలన విధించాలని సిఫారుసు చేస్తూ కేంద్రానికి నివేదిక సమర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉంటాం:అశ్వత్థామ
సమ్మె విషయంలో న్యాయస్థానం నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని కార్మిక సంఘాల ఐకాస కన్వీనర్ అశ్వత్థామరెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదాపడిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడారు.. ప్రభుత్వం భేషజాలకు పోకుండా ఉండాలని సూచించారు. ఇప్పటికైనా కోర్టు సూచన మేరకు కమిటీ వేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. ‘వేధింపులను జనం భరించలేకపోతున్నారు’
స్పందన కార్యక్రమంలో వినతులు ఇచ్చిన చేతులతోనే పురుగుమందులు తాగే దుస్థితిని ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు పెట్రోల్ సీసాలతో వెళ్లడం దురదృష్టకరమని ఆయన దుయ్యబట్టారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు మాట్లాడారు. వైకాపా వేధింపులు భరించలేకే ఆవేదనతో జనం ఈ పనులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. ఏపీపీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల
గ్రూప్-1 ప్రధాన పరీక్షల తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రకటించారు. ఫిబ్రవరి 4 నుంచి 16వ తేదీ మధ్య ఏడు పేపర్ల పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను డిసెంబరు 12 నుంచి 23 మధ్య నిర్వహించాలని మొదట నిర్ణయించారు. ప్రిలిమ్స్ ఫలితాల విడుదలలో ఆలస్యం కారణంగా పరీక్షల సన్నద్ధతకు సమయం సరిపోదని, పరీక్ష తేదీలను వాయిదా వేయాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. పథకాలు పవన్‌కు కనిపించడంలేదా?: పేర్ని
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పెళ్లిళ్ల మీద మక్కువ ఉంటే, సీఎం జగన్‌కు ప్రజాసేవ మీద మక్కువ ఉందని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. మంగళవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... పవన్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. జగన్ ఎప్పుడూ పవన్ గురించి వ్యక్తిగత విమర్శలు చేయలేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పవన్‌కు కనిపించడంలేదని, చంద్రబాబు చెప్పిన ఇసుక సమస్య ఒక్కటే కనిపిస్తోందని పేర్ని నాని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతున్నాయి: వీహెచ్
తెలంగాణలో జై జవాన్, జై కిసాన్ నినాదం అమలు కావడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణ వస్తే రైతు ఆత్మహత్యలు ఉండవని కేసీఆర్ చెప్పారని... నేటికీ రైతు ఆత్మహత్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. రోజు రోజుకూ రెవెన్యూ సమస్యలు తీవ్రమవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. భూమిపై రైతులకు హక్కులు ఉన్నా... పట్టాదారు పాస్ పుస్తకాలు రావడంలేదని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. రూ.7000కోట్లతో భారత్‌లోకి ‘గ్రేట్ వాల్’?
చైనాకు చెందిన అతిపెద్ద ఎస్యూవీ ఉత్పత్తి సంస్థ ‘గ్రేట్ వాల్ మోటార్స్’ భారత్‌లోకి నేరుగా ప్రవేశించేందుకు యోచిస్తున్నట్లు సమచారం. ఈ మేరకు భారత్‌లో రూ.7000కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. భారత ఆటో రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో గ్రేట్ వాల్ నిర్ణయం పట్ల విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. కోహ్లీ, బుమ్రా.. టాప్‌లోనే
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా వన్డే ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. భారత సారథి విరాట్ కోహ్లీ, పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా టాప్‌లో నిలిచారు. బ్యాటింగ్‌లో 895 రేటింగ్ పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా అతడి తర్వాతి స్థానంలో టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ (863) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. బౌలింగ్‌లో భారత్ నుంచి బుమ్రా (797) మినహా ఎవరూ టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. స్మార్ట్‌ఫోన్ ప్రీమియంసెగ్మెంట్లో యాపిల్ టాప్
ప్రపంచ వ్యాప్తంగా యాపిల్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సెప్టెంబరు 30తో ముగిసిన మూడో త్రైమాసికంలో భారత్‌లో స్మార్ట్‌ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ (రూ.35,000 పైబడి)లో 51.3 శాతం వాటాతో యాపిల్ అగ్రస్థానంలో నిలిచింది. ఈ సెగ్మెంట్లో అత్యధిక వాటాతో మెదటి స్థానంలో నిలవడం వరుసగా ఇది రెండోసారని ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ (ఐడీసీ) ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. వేల సంఖ్యలో వలస పక్షులు మృత్యువాత
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- పౌరసత్వ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
- లింగాపూర్ బాధితురాలి పేరు 'సమత'గా మార్పు
- ఏంలేదు..వాతావరణంపై మాట్లాడుకున్నాం..
- శరణార్థులకు పౌరసత్వం
- వైకాపాలో చేరిన గోకరాజు సోదరులు
- సభాపతిది అతి జోక్యం: చంద్రబాబు
- అతను నా తండ్రి కాదు: హేడెన్ వాల్ష్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
