close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ - 9 AM

1. నేడు ఆర్టీసీ కార్మికులతో సీఎం ఆత్మీయ సమావేశం

సమ్మె చేసిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకునేందుకు అనుమతించిన అనంతరం ఆర్టీసీని బలోపేతం చేసేందుకు కార్మికులను పిలిపించుకుని మాట్లాడతానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ మేరకు వారితో ఆదివారం సమావేశమవుతున్నారు. కార్మికులు సంస్థ అధికారులు,  ప్రభుత్వం నుంచి ఆశించే అంశాలు, అందుకు ప్రభుత్వం తీసుకోవాల్సిన తక్షణ, దీర్ఘకాలిక చర్యల గురించి చర్చించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. నేడు సిద్దిపేటలో వేలాడే వంతెన ప్రారంభం

తెలంగాణలో వివిధ రంగాల్లో ఆదర్శ నమూనాగా మారిన సిద్దిపేటలో ఇకపై పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుంది. ఇక్కడి కోమటిచెరువుపై నిర్మించిన వేలాడే వంతెన పలువురిని ఆకట్టుకుంటోంది. దీనిని ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ వంతెన లక్నవరం కన్నా 91 మీటర్ల పొడవైంది కావడం విశేషం. మంత్రి తన్నీరు హరీశ్‌రావు చొరవతో పర్యాటకాభివృద్ధి సంస్థ (టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) రూ.6 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఎస్సై, ఇద్దరు హెడ్‌కానిస్టేబుళ్ల సస్పెన్షన్‌

హైదరాబాద్‌ శివార్లలోని యువ వైద్యురాలు హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై వేటు పడింది. శంషాబాద్‌ ఠాణా ఎస్‌ఐ రవికుమార్‌, ఆర్జీఐఏ ఠాణా హెడ్‌కానిస్టేబుళ్లు పి.వేణుగోపాల్‌రెడ్డి, ఎ.సత్యనారాయణగౌడ్‌ను సస్పెండ్‌ చేస్తూ సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యురాలి అదృశ్యంపై కుటుంబ సభ్యులు స్టేషన్‌కు వచ్చిన సమయంలో పోలీసులు సరిగా స్పందించలేదని ఆరోపణలొచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. 100 కీలక నిర్ణయాలు

జగన్‌ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 100 కీలక నిర్ణయాలు తీసుకున్నారని, దశాబ్దాలుగా ఏ పాలకులకూ సాధ్యంకాని పథకాలను అమలుచేశారని వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు పేర్కొన్నారు. శనివారం ఆరునెలల జగన్‌ పాలనపై తెదేపా ప్రచురించిన పుస్తకంపై మంత్రి మాట్లాడారు. ‘అసలు రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజలను ముంచేసింది చంద్రబాబే.  తెదేపా ప్రచురించిన పుస్తకాన్ని లోకేశ్‌ సూట్‌కేసులో  పెట్టుకోవాలి. లేదంటే ప్రజలే వాళ్లను ఛీ కొడతారు’ అని వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. స్త్రీనిధి నుంచి రూ.లక్ష రుణం

గ్రామీణ, పట్టణ పరిధిలోని స్వయంసహాయక సంఘాల సభ్యుల జీవనోపాధి కల్పనకు ఏపీ ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా రూ.లక్ష వరకు రుణాన్ని అందించనుంది. ఈ రుణాన్ని గరిష్ఠంగా సంఘంలోని నలుగురు సభ్యులు పొందే అవకాశం కల్పించింది. వ్యవసాయ పరికరాల కొనుగోలు మొదలు చిన్నపాటి దుకాణాలు,    చీరల వ్యాపారం, వీధి వ్యాపారాలు, ఇతర 124 లఘుపరిశ్రమల ఏర్పాటుకు ఈ రుణాన్ని అందిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. హత్యాచార ఘటనపై స్పందించిన చిరంజీవి

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన యువ పశువైద్యురాలి హత్యాచార ఘటనపై ప్రముఖ సినీ నటుడు చిరంజీవి స్పందించారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి 

7. ఇంటివద్దకే ఉచితంగా ఫాస్టాగ్‌ సేవలు

ఇంటి వద్దకే ఉచితంగా ఫాస్టాగ్‌లను పంపిణీ చేయనున్నట్లు యాక్సిక్‌ బ్యాంక్‌ పేర్కొంది. తమ బ్యాంకు ఖాతాదార్లే కాకుండా ఇతర బ్యాంకుల ఖాతాదార్లు కూడా ఈ సౌలభ్యాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. డిసెంబరు 15 నుంచి అన్ని జాతీయ రహదార్ల టోల్‌ఫ్లాజాల్లో ఫాస్టాగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఫాస్టాగ్‌ అనేది వాహనం ముందు అద్దానికి అతికించే ఓ రీలోడబుల్‌ స్టిక్కర్‌ లాంటిది. దీని ద్వారా టోల్‌ప్లాజాలో వాహనం ప్రవేశించగానే ఆటోమేటిక్‌గా టోల్‌ ఛార్జీల చెల్లింపు పూర్తవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. రవిశాస్త్రిలా ఆడి చూపించండి

టీమ్‌ఇండియా కోచ్‌ రవిశాస్త్రిపై సామాజిక మాధ్యమాల్లో జరిగే ట్రోలింగ్‌పై టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించారు. ‘‘ఒక అజెండా ప్రకారమే రవిశాస్త్రిని విమర్శిస్తున్నారు. అతను పదో స్థానంతో కెరీర్‌ మొదలుపెట్టి ఓపెనర్‌గా పదోన్నతి పొందాడు. ఆ స్థానంలో 41 సగటుతో పరుగులు చేశాడు. అలాంటి వ్యక్తిని ఇంట్లో ఖాళీగా కూర్చునే వాళ్లు విమర్శిస్తున్నారు. అతను ఎదుర్కొన్న బౌలర్లను ఎదుర్కొని, సాధించినవన్నీ సాధించి తర్వాత.. లేదా అవి సాధించే ధైర్యం తెచ్చుకున్నాక దీనిపై చర్చకు రావాలి’’ అని విరాట్‌ అన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. కంప్యూటర్‌ ప్రాసెసర్లు ఇక యమస్పీడు!

ఆప్టికల్‌, ఎలక్ట్రానిక్‌ కంప్యూటింగ్‌ వ్యవస్థల సంధానతలో ఉన్న ఇబ్బందిని అధిగమించే సాధనాన్ని బ్రిటన్‌ శాస్త్రవేత్తలు తయారుచేశారు. విద్యుత్‌-ఆప్టికల్‌ ద్వంద్వ విధులు నిర్వర్తించే సాధనాన్ని అభివృద్ధి చేశారు. దీనివల్ల వేగంగా పనిచేసే, ఇంధనాన్ని పొదుపుగా ఉపయోగించుకునే డేటా నిల్వ సాధనాలు, ప్రాసెసర్ల రూపకల్పనకు మార్గం సుగమమవుతుందని ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. కేదారినాథ్‌ను కప్పేసిన మంచుదుప్పటి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.