close

తాజా వార్తలు

ఆసక్తికరంగా నయన్‌ ‘ఐరా’ ట్రైలర్‌

‘.. ఎవర్నీ నేను ప్రాణాలతో వదలను’

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక న‌య‌న‌తార తొలిసారిగా ద్విపాత్రాభిన‌యం చేసిన సినిమా ‘ఐరా’. సర్జున్‌ దర్శకత్వం వహించారు. గంగా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, కేజేఆర్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగు, త‌మిళ భాషల్లో ఈ నెల 28న సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.
ఈ చిత్రం ట్రైలర్‌ను బుధవారం విడుదల చేశారు. ఎంతో ఆసక్తికరంగా ఉన్న ఈ ప్రచార చిత్రం అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ‘నీకు భవానీ ఎవరో, ఏంటో తెలుసా?’ అనే డైలాగ్‌తో ట్రైలర్‌ ఆరంభమైంది. ‘ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వని సంతోషాన్ని నువ్వు నాకు ఇచ్చావు. దాన్ని దూరం చేసిన ఎవర్నీ నేను ప్రాణాలతో వదలను’ అంటూ ఓ మహిళ అంటోంది. క్రైమ్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.