
తాజా వార్తలు
హైదరాబాద్: ‘హిప్పీ’ సినిమాలో నటించేందుకు జేడీ చక్రవర్తి ఒప్పుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని సినీనటుడు కార్తికేయ అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రమిది. దిగంగన సూర్యవన్షి కథానాయిక. జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రను పోషించారు. టి.ఎన్.కృష్ణ దర్శకుడు. కలైపులి ఎస్.థను నిర్మాత. జూన్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ.. ‘‘హిప్పీ’ జూన్ 7న విడుదల కానుంది. షూటింగ్ చాలా బాగా జరిగింది. ఔట్పుట్ అనుకున్నదానికన్నా బాగా వచ్చింది. అందరం సంతోషంగా ఉన్నాం. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది. ‘కబాలి’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను నిర్మించిన కలైపులి ఎస్. థను సంస్థలో `హిప్పీ` చేయడం గొప్పగా భావిస్తున్నాను. ఆయన ఎక్కడా రాజీ పడకుండా పెద్ద బడ్జెట్ చిత్రంలా చేశారు. ఇందులో జేడీ చక్రవర్తి పాత్ర చాలా కీలకం. ఆయన కథ విని ఒప్పుకోవడంతో సంతోషంగా ఫీలయ్యా. ఎందుకంటే ఆయన నటనకు నేను పెద్ద అభిమానిని. హీరోయిన్ దిగంగన చాలా అద్భుతమైన నటి. ఈ సినిమాలో తనది మంచి క్యారెక్టర్. అందరినీ మెప్పిస్తుంది. సంగీతం కూడా చాలా బాగుంది. ఆర్.డి. రాజశేఖర్ ఫొటోగ్రఫీ సినిమాకు బలం’ అని అన్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఒకే గదిలో అవివాహిత జంట ఉండటం నేరం కాదు
- విచారణ ‘దిశ’గా...
- ఎన్‌కౌంటర్‌పై సీపీఐ నారాయణ క్షమాపణ
- ఎమ్మెల్యే ఆనం వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం
- ‘అక్క’ కోసం వచ్చింది అక్కడే చితికిపోయింది!
- ఘోర అగ్ని ప్రమాదం..43 మంది మృతి
- కొడితే.. సిరీస్ పడాలి
- అంతా అయ్యాక ఎందుకు వచ్చారు?
- పెళ్లే సర్వం, స్వర్గం
- Airtel: ఔట్‌గోయింగ్ కాల్స్‌పై పరిమితి ఎత్తివేత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
