
తాజా వార్తలు
కోడంబాక్కం: సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘దర్బార్’. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని ఈ చిత్రంలో నయనతార హీరోయిన్గా నటిస్తోంది. భారీ బడ్జెట్‌తో లైకా సంస్థ నిర్మిస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ సినిమా చిత్రీకరణ ముంబయిలో జరుగుతోంది. నయనతార కూడా రెండు రోజుల క్రితం షూటింగ్లో పాల్గొన్నారు. ‘కబాలి’, ‘కాలా’ చిత్రాల్లో రజనీకాంత్ యంగ్‌గా కనిపించక పోవడంతో అభిమానులు సైతం కాస్త నిరాశకు గురయ్యారు. దీంతో కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలోని ‘పేట’లో ఆయన యువకుడిగా, స్టైల్‌గా కనిపించి మెప్పించారు. దీంతో ఏఆర్ మురుగదాస్ చిత్రంలోనూ యవ్వనంగానే కనిపిస్తున్నారు. ఇటీవల ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. అభిమానులను ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా ముంబయిలో జరుగుతున్న షూటింగ్ ఫొటోలు గత కొన్ని రోజులుగా ఒక్కొక్కటిగా లీకవుతున్నారు. దీంతో ‘దర్బార్’ చిత్ర బృందం షాక్‌కు గురవుతోంది. వాస్తవానికి ఫొటోషూట్ ఫొటోలే ప్రారంభంలో లీకయ్యాయి. అయితే అప్పుగా పెద్దగా పట్టించుకోని చిత్రబృందం ఇప్పుడు మరింత జాగ్రత్త పడుతోంది. రెండు రోజుల క్రితం నయనతార షూటింగ్‌కు వచ్చిన ఫొటోలు, రజనీకాంత్ ఉన్న ఫొటో లీకైంది. ఇప్పుడు తాజాగా రజనీకాంత్ క్రికెట్ ఆడుతుండగా నయనతార చూస్తున్న ఫొటోలు లీకయ్యాయి. దీంతో మళ్లీ ఆందోళన చెందడం ‘దర్బార్’ వంతవుతోంది. ఏదేమైనప్పటికీ.. ఈ ఫొటోల్లో తమ హీరో ‘అదుర్స్..’ అంటూ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కామెంట్లు పెడుతున్నారు. చాలా స్టైల్‌గా కనిపిస్తున్నారని, ఈ సినిమా కూడా రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్నారు. అన్నట్లుగానే.. రజనీకాంత్ కూడా స్టైల్‌గా కనిపించి మెప్పిస్తున్నారు. లీకైన ఫొటోలకే ఇంత క్రేజీ అయితే.. రెండో లుక్, టీజర్లకు ఎంత క్రేజీ ఉంటోందనని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- గుర్రమెక్కుతుంటే బాదేశారు... తాళి కడుతుంటే ఆపేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
