close

తాజా వార్తలు

ఆగిపోనున్న ‘మీలో ఎవరు కోటీశ్వరుడు!’

20 ఏళ్ల పాటు విజయవంతంగా ప్రసారం

 

వాషింగ్టన్‌ డి.సి.: ప్రపంచ వ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందిన ప్రముఖ గేమ్‌ షో ‘హూ వాంట్స్‌ టు బి ఎ మిలియనీర్‌’ (తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు?) కార్యక్రమాన్ని త్వరలో నిలిపివేయనున్నారు. అమెరికన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ నెట్‌వర్క్‌ (ఏబీసీ) ఛానెల్‌లో 20 ఏళ్ల పాటు ఈ కార్యక్రమం విజయవంతంగా ప్రసారమవుతోంది. 1999 ఆగస్టు 16న తొలి ఎపిసోడ్‌ ప్రసారం కాగా ఆ సీజన్‌ 2002 జూన్‌ 27న పూర్తయింది. అప్పటి నుంచి 17 సీజన్లు కొనసాగింది. ఆఖరి సీజన్‌ ఈ నెల 31తో పూర్తి కానుండగా, ఇదే ఆఖరి సీజన్‌ అని నిర్వహకులు తెలిపినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ వెల్లడించింది. మొదట్లో ఈ షోను ప్రముఖ అమెరికన్‌ సెలబ్రిటీ రెజీస్‌ ఫిల్‌బిన్‌ హోస్ట్‌ చేయగా, తర్వాత మెరెడిత్‌ వియరా, టెర్రీ క్రూస్‌, క్రిస్‌ హ్యారిసన్‌ తదితరులు నిర్వహించారు. 
ఈ గేమ్‌ షో వివరాలు అందరికీ తెలిసినవే. బహుళ సమాధాన ప్రశ్నల రూపంలో ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే కొద్దీ ఆ తర్వాతి ప్రశ్న మరింత కఠినంగా అడుగుతారు. మొత్తం 15 ప్రశ్నలకు సమాధానం చెప్తే 1 మిలియన్‌ డాలర్ల సొమ్ము సొంతమవుతుంది. మధ్యలో సహాయం కోసం మూడు హెల్ప్‌లైన్లు కూడా ఉంటాయి. 
ఈ కార్యక్రమం మాతృక ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ ప్రసారమై ప్రజాదరణ పొందింది. హిందీలో కౌన్‌ బనేగా కరోడ్‌పతి, తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు పేర్లతో ప్రసారమైంది. అన్ని చోట్లా ఈ కార్యక్రమాన్ని పెద్ద స్టార్లు నిర్వహించారు. హిందీలో ఈ కార్యక్రమాన్ని అమితాబ్‌ బచ్చన్‌, తెలుగులో నాగార్జున (1-3 సీజన్లు), తర్వాత చిరంజీవి (నాలుగో సీజన్‌) నిర్వహించిన సంగతి తెలిసిందే.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.