close

తాజా వార్తలు

కొత్త సినిమాలు.. చెమటోడుస్తున్న హీరో

హైదరాబాద్‌: నటుడు సుధీర్‌బాబు తన తదుపరి సినిమాల కోసం జిమ్‌లో చెమటోడుస్తున్నారు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో రెండు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ తెరకెక్కిస్తున్న ‘v’ సినిమాతో పాటు ప్రముఖ మాజీ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్‌ బయోపిక్‌లో నటించబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పాత్రకు తగినట్లుగా శరీరాకృతిని మలుచుకునేందుకు కఠినంగా కసరత్తులు చేస్తున్నారు.

ఆయన జిమ్‌ చేస్తున్న ఫొటోలను చిత్రవర్గాలు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశాయి. ఆ ఫొటోల్లో సుధీర్‌బాబు మునుపటి కంటే మరింత ఫిట్‌గా కనిపిస్తున్నారు. తాను కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచి సినిమా సినిమాకూ ఎన్ని కిలోల బరువు పెరిగారో వివరిస్తూ ఇటీవల ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను సుధీర్‌బాబు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.