close

తాజా వార్తలు

సమంతను బామ్మ అనడం కంటే..: దర్శకేంద్రుడు

‘ఓ బేబీ’ ట్రైలర్‌ను ఉద్దేశిస్తూ రాఘవేంద్రరావు

హైదరాబాద్‌: సినీ నటి సమంతపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ప్రశంసల జల్లు కురిపించారు. సమంత నటించిన ‘ఓ బేబీ’ సినిమాను ఆయన ప్రత్యేకంగా వీక్షించారట. సినిమా తనకెంతో నచ్చిందంటూ రాఘవేంద్రరావు ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ‘ ‘ఓ బేబీ’ సినిమా చూశాను. చాలా కొత్తగా భావోద్వేగపూరితంగా ఉంది. సమంత 70 ఏళ్ల బామ్మగా చేసింది అనడం కంటే 70 ఏళ్ల అనుభవం ఉన్న నటిగా చేసింది అంటే బాగుంటుంది. ఈ సినిమా తనకి ఇంకా పెద్ద పేరు తీసుకొస్తుంది’ అంటూ సినిమా ట్రైలర్‌ లింక్‌ను షేర్‌ చేశారు.
‘ఓ బేబీ’ సినిమా ట్రైలర్‌పై సినీ ప్రముఖులు ఏమన్నారంటే..

నాగార్జున: నచ్చింది కోడలా..
నాగచైతన్య: ‘ఓ బేబీ’ ట్రైలర్‌ చాలా నచ్చింది. సినిమా అంతకంటే బాగుంది.
అడివి శేష్‌: నీ నటనతో చంపేశావ్‌ సమంత. ట్రైలర్‌ అద్భుతంగా ఉంది. చిత్రబృందానికి కంగ్రాట్స్‌.
రకుల్‌: ‘ఓ బేబీ’ ట్రైలర్‌ క్యూట్‌గా ఉంది. సమంత ఎంత అందంగా ఉన్నావ్‌..
బీవీఎస్‌ రవి: నా స్నేహితురాలు నందినీ రెడ్డికి అంతా మంచే జరగాలని కోరుకుంటాను. ఈ సినిమా సమంత, నాగశౌర్యకు ఓ మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆశిస్తున్నాను.
తమన్‌: ‘ఓ బేబీ’.. విన్నర్‌గా నిలిచిపోతుంది.

శోభు యార్లగడ్డ: చాలా ఆసక్తికరమైన కాన్సెప్ట్‌. సమంత పాత్ర చాలా నచ్చింది.
సందీప్‌ కిషన్‌: సినిమా చూడాలని చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. ఎప్పటిలాగే సమంత తన పాత్రలో ఒదిగిపోయారు.
రాహుల్‌ రవీంద్రన్‌: ‘ఓ బేబీ’.. చాలా నచ్చింది. మా అమ్మమ్మ, నాన్నమ్మలకు మళ్లీ యవ్వనాన్ని పొందగలిగే అవకాశం వస్తే వారు ఎలాంటి కలలను నెరవేర్చుకోవాలని అనుకునేవారో తెలుసుకోవాలనుంది. సమంత అభిమానులకు ఇది ఈ సినిమా ఓ తుపాను లాంటిది.
సుశాంత్‌: త్వరలో రోలర్‌ కోస్టర్‌ రైడ్‌ చూడబోతున్నాం.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.