close

తాజా వార్తలు

తమిళంలోనూ మిషన్‌ మంగళ్‌

Kollywood,Tamilanadu

‘మిషన్‌ మంగళ్‌’లో ఓ దృశ్యం

కోడంబాక్కం, న్యూస్‌టుడే: హిందీలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం ‘మిషన్‌ మంగళ్‌’. 2013లో భారత్‌ చేపట్టిన మంగళ్‌యాన్‌ మిషన్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్ర పోషించారు. విద్యాబాలన్, నిత్యామేనన్, సోనాక్షిసిన్హా, తాప్సి తదితరులు నటించారు. జగన్‌శక్తి దర్శకత్వం వహించారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తమిళంలోకి కూడా అనువాదం అయింది. అదే రోజున ఇక్కడా విడుదల కానుంది. సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. ‘‘నా సోదరి సుజాత మంగళ్‌యాన్‌ మిషన్‌లో పనిచేశారు. ఈ సినిమాకు ఇస్రో పూర్తిస్థాయిలో సహకరించింది. వైజ్ఞానిక పరమైన సమాచారం, సలహాలు అందించింది. వీఎఫ్‌ఎక్స్‌ బృందం చిత్రంలో చాలా కీలకంగా పనిచేసింది. ఇస్రో సహకారం లేకుండా ఈ సినిమా సాధ్యమయ్యేది కాదు. బెంగళూరులోని ఆ సంస్థ ప్రాంగణంలో చిత్రీకరణ చేయాలని అనుకున్నాం. కానీ భద్రతా కారణాలతో ఆ అవకాశం దక్కలేదు. ఈ సినిమా సామాన్యులకు కూడా అర్థమయ్యేలా ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించాం. మంగళ్‌యాన్‌ విజయం ప్రతి ఒక్కరిది. అలానే ప్రతి ఒక్కరి మన్ననలను మా సినిమా కూడా అందుకుంటుందని’’ తెలిపారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.