Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144442
            [news_title_telugu_html] => 

రూ.10 కోట్ల డీల్‌కు నో చెప్పిన సాగరకన్య

[news_title_telugu] => రూ.10 కోట్ల డీల్‌కు నో చెప్పిన సాగరకన్య [news_title_english] => Shilpa Shetty turns down Rs 10 crore slimming pills deal [news_short_description] => బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 13 ఏళ్ల పాటు తెరకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ బిజీగా గడిపారు....... [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => BzpyLjhBUUA [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-19 10:08:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రూ.10 కోట్ల డీల్‌కు నో చెప్పిన సాగరకన్య - Shilpa Shetty turns down Rs 10 crore slimming pills deal - EENADU
close

తాజా వార్తలు

రూ.10 కోట్ల డీల్‌కు నో చెప్పిన సాగరకన్య

ముంబయి: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి ఫిట్‌నెస్‌కు ఎంత ప్రాధాన్యం ఇస్తారో తెలిసిందే. 13 ఏళ్ల పాటు తెరకు దూరమైనా యోగా వీడియోలు చేస్తూ బిజీగా గడిపారు. ఇప్పుడు ఇదే ఫిట్‌నెస్‌కు సంబంధించి ఓ కంపెనీ ఆమెకు ఓ ఆఫర్‌ ఇచ్చింది. ప్రముఖ ఆయుర్వేద కంపెనీ  స్లిమ్మింగ్‌ పిల్స్‌(సన్నబడటానికి వాడే మాత్రలు)కు ప్రచారకర్తగా వ్యవహరించాలని అందుకు గానూ రూ.10 కోట్లు ఇస్తామని సదరు కంపెనీ చెప్పింది. అందుకు శిల్ప అంగీకరించలేదు. తాను నమ్మని విషయాలను ప్రజలకు చెప్పలేనని కరాఖండిగా చెప్పేసింది.

సరైన ఆరోగ్య పద్ధతులు, ఆహారం తీసుకుంటే ఫిట్‌నెస్‌ దానంతట అదే వస్తుందని, సహజసిద్ధంగా బరువు తగ్గితేనే ఆరోగ్యంగా ఉంటారని తెలిపింది. ఆ కంపెనీ ఆఫర్‌ అంగీకరించేలా ఉన్నా..తన మనస్సాక్షికి నచ్చని పని చేయనని తేల్చి చెప్పింది. స్లిమ్మింగ్‌ పిల్స్‌, కడుపు మాడ్చుకోవడం వల్ల బరువు తగ్గరని తెలిపింది. జీవన శైలిలో మార్పులు చేసుకుంటే కాస్త ఆలస్యమైనా సన్నబడవచ్చని చెప్పుకొచ్చింది. ఫిట్‌నెస్‌, ఆరోగ్య కరమైన ఆహార పదార్థాలకు సంబంధించి శిల్ప ఒక యాప్‌ను కూడా తీసుకొచ్చింది. ఆహార నియమాలు, ఫిట్‌నెస్‌ సలహాలను ఈ యాప్‌ ద్వారా అడిగి తెలుసుకోవచ్చు.

 వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాతో వివాహం అయ్యాక వెండితెరకు దూరమైంది శిల్పాశెట్టి. దశాబ్దకాలం తర్వాత మళ్లీ వెండితెరపై సందడి చేయబోతోంది. షబ్బీర్‌ ఖాన్‌ తెరకెక్కిస్తున్న ‘నికమ్మ’తో బాలీవుడ్‌లో మెరవనుందీ పొడుగు కాళ్ల సుందరి. ‘‘ఇన్నేళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఇప్పటి వరకూ చూడని ఓ సరికొత్త పాత్రలో ‘నికమ్మ’లో చూడబోతున్నార’’ని శిల్ప చెప్పింది. ఈ సినిమాలో నిన్నటి తరం నటి భాగ్యశ్రీ కుమారుడు అభిమన్యు దాసాని కీలక పాత్రలో నటిస్తున్నారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.