close

తాజా వార్తలు

బాలకృష్ణ@105.. ఫస్ట్‌లుక్‌ చూశారా

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 105వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఇందులో బాలయ్య సూట్‌లో హ్యాండ్సమ్‌గా కనిపించారు. ఈ లుక్‌కు సోషల్‌మీడియాలో అభిమానుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కోసం బాలయ్య బరువు తగ్గినట్లు ఫస్ట్‌లుక్‌ను బట్టి తెలుస్తోంది. కె.ఎస్‌. రవికుమార్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌, వేదిక కథానాయికల పాత్రలు పోషిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై సి. కల్యాణ్‌ నిర్మిస్తున్నారు.

ఈ ఏడాది బాలయ్య ‘యన్‌.టి.ఆర్: కథానాయకుడు‌’, ‘యన్‌.టి.ఆర్‌: మహానాయకుడు’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్‌ జీవితం ఆధారంగా దర్శకుడు క్రిష్‌ ఈ సినిమాల్ని  రూపొందించారు. దీని తర్వాత కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. ఇటీవల మొదటి షెడ్యూల్‌ పూర్తయింది.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.