
తాజా వార్తలు
హైదరాబాద్: అధిక సంఖ్యలో మొక్కలు నాటడమే ఇప్పటి, భవిష్యత్తు తరాలకు మనం ఇచ్చే ఉత్తమ బహుమతని సద్గురు జగ్గీవాసుదేవ్ అన్నారు. ఆయన ఈషా ఫౌండేషన్స్ తరఫున ‘కావేరీ పిలుస్తోంది’ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. నదిని పునరుజ్జీవింపజేయడం కోసం, అటవీ ప్రాంత విస్తీర్ణాన్ని పెంచడం కోసం ఆయన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 242 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో లక్ష మొక్కలు నాటేందుకు సమంత నడుం బిగించారు. రూ.42 చెల్లిస్తే ఒక్క మొక్క నాటినవారు అవుతారని ఫ్యాన్స్‌తో అన్నారు. అందరూ ఇందులో పాలుపంచుకోవాలని కోరారు. ఈ మేరకు ఇటీవల ఆమె ట్వీట్ చేశారు.
కాగా ఇప్పుడు దీన్ని ఉద్దేశిస్తూ సద్గురు పోస్ట్ చేశారు. ‘ప్రియమైన సమంత.. తల్లి కావేరీ కోసం నీ సందేశాన్ని చూసిన చాలా మంది యువత కార్యక్రమంలో పాల్గొనేందుకు ముందుకు వస్తున్నారని నాకు తెలిసింది. ‘కావేరీ రక్ష’లో నువ్వు అనుకున్న దానికంటే అధిక టార్గెట్‌ను చేరుకోవాలని ఆశిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇప్పటి, భవిష్యత్తు తరాలకు మనం ఇవ్వగలిగే అతి ఉత్తమమైన బహుమతి ఇది’ అని ఆయన పేర్కొన్నారు. దీనికి సామ్... ‘‘కావేరీ పిలుస్తోంది’ కార్యక్రమంలో పాల్గొనడం గర్వంగా ఉంది’ అని రిప్లై ఇచ్చారు.
సినిమా
రాజకీయం
జనరల్
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
