close

తాజా వార్తలు

మాల్దీవుల్లో సుస్మిత యోగా.. వీడియో చూశారా..!

నేను ఎక్కడ ఉన్నానో గుర్తుపట్టండి..?

ముంబయి: తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు మాజీ విశ్వ సుందరి, బాలీవుడ్‌ నటి సుస్మితా సేన్‌. ప్రస్తుతం ఆమె తన ఇద్దరు కుమార్తెలు, ప్రియుడు రోహ్మాన్‌ షాల్‌తో కలిసి మాల్దీవులలో సేద తీరుతున్నారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సుస్మిత సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా సుస్మిత షేర్‌ చేసిన కొన్ని ఫొటోలు, వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. మాల్దీవుల్లోని ఓ సముద్రం వద్ద సుస్మిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చక్రాసనం వేశారు. ఈ వీడియోను అభిమానులతో పంచుకుంటూ.. ‘నేను ఎక్కడ ఉన్నానో గుర్తుపట్టండి?’ అంటూ ఓ చిన్న సవాల్‌ విసిరారు. ఆ వీడియోలో ఆమెను గుర్తించిన అభిమానులు వెంటనే కామెంట్ల రూపంలో తమ సమాధానాన్ని తెలిపారు.



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.