close

తాజా వార్తలు

మహిళాశక్తి ప్రపంచానికి చాటి చెబుదాం!

నదేశంలో స్త్రీని లక్ష్మీదేవితో పోలుస్తాం. అలాంటి వారి విజయాలను సంతోషంగా పంచుకుంటే...సమాజం మరింతగా అభివృద్ధి చెందుతుంది. అందుకే ఈ దీపావళికి మహిళల విజయాలను స్మరించుకుందాం. మీరూ మీకు తెలిసిన అతివల విజయగాథల్ని పంచుకోండి అంటోంది నటి దీపికా పదుకుణె. బాడ్మింటన్‌ క్రీడాకారిణి సింధుతో కలిసి రూపొందించిన ఓ వీడియోను ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ‘భారత్‌కీలక్ష్మి’ ఉద్యమానికి మద్దతుగా తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్‌ చేసింది. అంతకు ముందే సింధు తన ట్విటర్‌ ఖాతాలో ఈ వీడియోని అప్‌లోడ్‌ చేసి ‘మహిళలకి సరైన గౌరవం లభించినప్పుడే...సమాజం అభివృద్ధి చెందుతుంది’ అని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ వీడియో  వైరల్‌ అవుతోంది. దీనిపై ప్రధాని మోదీ ‘అద్భుత విజయాల్ని అందించిన అసాధారణ మహిళలిద్దరూ రూపొందించిన వీడియో అత్యద్భుతం’ అంటూ స్పందించారు. ఈ దీపావళిని మహిళలకు అంకింతమిద్దాం అంటూ పిలుపునిచ్చారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.