
తాజా వార్తలు
వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం..
హైదరాబాద్: పనిలేక, సోమరిగా ఉన్న వ్యక్తులే సోషల్‌మీడియాలో ఇతరుల్ని విమర్శిస్తూ ఉంటారని కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ అభిప్రాయపడ్డారు. టాలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నారు. ఆమె దుస్తుల ఎంపికపై కొందరు నెటిజన్లు వివిధ సందర్భాల్లో మండిపడ్డారు. ఇలాంటి విమర్శల గురించి తాజాగా రకుల్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడారు. గుర్తు తెలియని వ్యక్తులు అనే మాటలు తనను బాధించవని అన్నారు.
‘విమర్శకుల్ని నేను పట్టించుకోను. ఇన్నేళ్లలో నేను కేవలం ఒకే ఒక్కసారి (గతేడాది) విమర్శకుల్ని ఉద్దేశించి ట్వీట్ చేశా. అలాంటి వారికి చెడును ప్రచారం చేయడం మాత్రమే తెలుసు. వారికి జీవితంలో దీనికి మించి చేయడానికి మంచి పనులు ఉండవు. ఎటువంటి పనిలేకుండా ఖాళీగా కూర్చుని ఉన్నప్పుడు మాత్రమే ఇలా పనిలో ఉన్న ఇతరుల్ని తిట్టడం పనిగా పెట్టుకుంటారనేది నా అభిప్రాయం. నా నటన బాలేదని అంటే.. నేను ఇంకా ఉత్తమంగా చేసేందుకు ప్రయత్నిస్తా. నాలోని లోపాలు చెబితే మంచిదే. కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే మాత్రం నేను పట్టించుకోను. నా సంతోషం మూడో వ్యక్తికి సంబంధించింది కాదు. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు ముఖ్యం. వారి మాటల్ని పట్టించుకుంటాను. ఎందుకంటే నేనేంటో వారికి మాత్రమే తెలుసు. అయినా ఇలాంటి విమర్శలు లేకపోతే సక్సెస్‌కు విలువ ఉండదు. నెగటివిటీ మనల్ని ఇంకా బలంగా తయారు చేస్తుంది. విజయానికి పొంగిపోయి, పరాజయానికి కుంగిపోయే వ్యక్తిని నేను కాదు’ అని రకుల్ చెప్పారు.