close

తాజా వార్తలు

విహారి ఔట్‌: భారత్‌ 416 ఆలౌట్‌

కింగ్‌స్టన్‌: మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ హనుమ విహారి(111; 225 బంతుల్లో 16×4) శతకంతో మెరిసిన వేళ వెస్టిండీస్‌తో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 416 పరుగులకు ఆలౌటైంది. ఇషాంత్‌ శర్మ(57; 80బంతుల్లో 7×4) అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. విండీస్‌ బౌలర్లలో హోల్డర్‌ ఐదు వికెట్లు, భారీకాయుడు కార్న్‌వాల్‌ మూడు వికెట్లు తీశాడు. 264 పరుగుల వద్ద రెండో రోజు ఆట మొదలుపెట్టిన కోహ్లీసేన ఆరంభంలోనే రిషబ్‌పంత్‌(27) వికెట్‌ కోల్పోయింది. జడేజా(16) కాసేపు పోరాడినట్లే కనిపించాడు. కానీ కార్న్‌వాల్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 

విహారి తోడుగా ఇషాంత్‌..

రెండో రోజు భారత ఇన్నింగ్స్‌లో విహారి-ఇషాంత్‌ జోడీ ప్రదర్శనే హైలైట్‌. వీరిద్దరూ విండీస్‌ బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఈ క్రమంలోనే విహారి.. రోచ్‌ బౌలింగ్‌లో సెంచరీ అందుకున్నాడు. టెస్టుల్లో అతనికిది తొలి శతకం కావడం విశేషం. కాసేపటికే ఇషాంత్‌ శర్మ కూడా అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. లంబూకి కూడా టెస్టుల్లో ఇదే తొలి అర్ధశతకం. అనంతరం బ్యాట్‌ ఝళిపించే క్రమంలో ఇషాంత్‌.. బ్రాత్‌వైట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో 112 పరుగుల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. షమి డకౌట్‌ కావడం..  తర్వాతి ఓవర్‌లో హోల్డర్‌ బౌలింగ్‌ విహారి కూడా ఔట్‌ కావడంతో 140.1 ఓవర్లలో 416 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్‌ ముగిసింది. టెస్టుల్లో హోల్డర్‌కిది వందో వికెట్‌. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.