close

తాజా వార్తలు

పింగ్లాన్‌లో కొనసాగుతున్న ఎదురుకాల్పులు

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా పింగ్లాన్‌ వద్ద సైన్యం-ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి.  ఈ ఉదయం ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒక మేజర్‌ సహా ముగ్గురు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందారు. ఈ నేపథ్యంలో పింగ్లాన్‌ ప్రాంతంలో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. ఓ భవనంలో ఉగ్రవాదులు ఉన్నట్లు అనుమానించిన సైన్యం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టింది. దీంతో ఉగ్రవాదులు కాల్పులు మొదలుపెట్టారు.  ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటి వరకు ఒక లెఫ్టినెంట్‌ కల్నల్‌, మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.