close

తాజా వార్తలు

యువ ఎస్‌బీఐ..! ​​​​​​​

ముంబయి: ప్రభుత్వ  రంగానికి చెందిన బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ టెక్‌ వైపు మళ్లుతోంది. పదవీవిరమణ చేసేవారిలో 75శాతం మందిని మాత్రమే ఐదేళ్లలో భర్తీ చేయాలని నిర్ణయించింది. ఎస్‌బీఐకు సంబంధించి మొత్తం 2018లో 12వేల మంది పదవీవిరమణ చేస్తే 10వేల మందిని నియమించుకొంది. వీరిలో అత్యధికులు ఎంబీఏ లేదా ఇంజినీరింగ్‌ పట్టభద్రులు ఉన్నారు. దీనిపై ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘‘క్లరికల్‌ స్థాయిలో మంచి సాంకేతికతపై పట్టున్న మంచి ఉద్యోగులు లభించడం మాకు కలిసొచ్చే అంశం. వీరి కెరీర్‌ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. వీరిలో అత్యధిక మంది మా అంతర్గత పరీక్షలకు కచ్చితంగా హాజరవుతున్నారు.’’ అని తెలిపారు.

పదవీ విరమణల్లో 75శాతం మందిని మాత్రమే భర్తీ చేయాలని 2018లో జరిగిన బోర్డు సమావేశంలో నిర్ణయించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో మానవనరుల తగ్గింపుపై దృష్టిపెట్టింది. అదే సమయంలో ఏటా 10వేలకు తగ్గకుండా చూసుకోవాలనేది ప్రణాళిక. ఈ 10వేల నియామకాల్లో 8వేల మంది క్లరికల్‌ ఉద్యోగాలకు కాగా.. 2వేల మంది ఆఫీసర్‌ కేడర్‌లోకి తీసుకొంటున్నారు. 2020నాటికి బ్యాంక్‌లో పదవీవిరమణలు తారాస్థాయికి చేరతాయి. ఏటా 12,500 మంది పదవీ విరమణ చేస్తారు. ఆ తర్వాత పదవీ విరమణ చేసేవారి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. బ్యాంకు ఉద్యోగుల సగటు వయస్సు కూడా 48 నుంచి 43కు తగ్గుతుంది.

వీరంతా ఈ విభాగాల్లోనే ఎక్కువ..

 కొత్తగా వచ్చేవారు లోన్‌ అడ్వైజర్స్‌గా, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, రికవరీ విభాగం, రిస్క్‌ మేనేజ్‌ మెంట్‌ వంటి కొత్త బాధ్యతలను చూసుకొంటున్నారు. ప్రస్తుతం మొత్తం లావాదేవీల్లో 87శాతం బ్యాంకు బయటే జరిగిపోతున్నాయి. బ్యాంకులు కూడా నేరుగా మార్కెట్‌ నుంచి నిపుణులను నియమించుకొంటున్నాయి. నేరుగా బి-స్కూల్స్‌కు వెళ్లి నియమించుకొనే సంప్రదాయాన్ని పక్కనపెట్టేశాయి.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.