close

తాజా వార్తలు

లెక్కలేనన్ని... దారులు!

ఇంటర్‌ తర్వాత?

ఎంపీసీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసిన తర్వాత ఇంజినీరింగ్‌ లేదా బీఎస్సీ తప్ప మరొకటి వెంటనే తోచదు. కానీ దాదాపు అన్ని రకాల మార్గాల్లోకి ప్రవేశించే అవకాశం ఈ విద్యార్థులకు ఉంది. విభిన్న బ్రాంచీలతో ఇంజినీరింగ్‌ డిగ్రీతో పాటు ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌లు చేసుకోవచ్చు. బీఎస్సీ, ఎంఎస్‌సీలతో పాటు బీఎడ్‌, ఎంఎడ్‌లు పూర్తి చేసుకునే వీలుంది. కొన్ని పరీక్షలతో ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ల్లో చేరి బీటెక్‌ పట్టా అందుకోవచ్చు. పైలట్‌ శిక్షణలతోపాటు ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌లోని ఎన్నో కోర్సుల్లోకి ఎంటరై పోవచ్చు.

 

ఇంజినీరింగ్‌

ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్‌ పూర్తిచేసినవారి మొదటి ప్రాధాన్యం ఇంజినీరింగ్‌కే లభిస్తోంది. ఇంజినీరింగ్‌ విద్యలో ఎదురులేని సంస్థలు ఐఐటీలు, ఎన్‌ఐటీలు. వీటిలో ప్రవేశం జేఈఈ ద్వారా లభిస్తుంది. ఇదే స్కోర్‌తో ట్రిపుల్‌ ఐటీలతోపాటు దేశంలో ప్రసిద్ధి చెందిన ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలల్లో చేరవచ్చు. రాష్ట్రస్థాయిలో విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఎంసెట్‌తో అవకాశం కల్పిస్తోంది.  బిట్స్‌, విట్‌, ఎస్‌ఆర్‌ఎం, కేఎల్‌యూ, గీతం మొదలైన సంస్థలు నిర్వహించే పరీక్షలూ రాసుకోవచ్చు. ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ పరీక్షలతో బీటెక్‌ ఉచితంగా చదువుకోవచ్చు..

ఆర్కిటెక్చర్‌
ఎంపీసీ విద్యార్థులకు మరో కోర్సు బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీ ఆర్క్‌). నిర్మాణ రంగంలో ఇంజినీరింగ్‌ సేవలు అందించాలనుకునేవారు ఈ కోర్సులో చేరవచ్చు. కోర్సు వ్యవధి అయిదేళ్లు. ఐఐటీలు, ఇతర ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఈ కోర్సు అందిస్తున్నారు. ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈలో అదనంగా మరో పేపర్‌ రాయాల్సి ఉంటుంది.  స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ ఈ కోర్సులకు ప్రసిద్ధ సంస్థ.

 

బీఎస్సీ కోర్సులు

ఇంటర్‌ తర్వాత నచ్చిన గ్రూప్‌ కాంబినేషన్లతో బీఎస్సీ కోర్సులో చేరిపోవచ్చు. ఇంటర్‌లో సాధించిన మార్కుల ద్వారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశం లభిస్తుంది. అందుబాటులో ఉన్న కోర్సుల కాంబినేషన్లు: మ్యాథ్స్‌-ఫిజిక్స్‌-కెమిస్ట్రీ, మ్యాథ్స్‌-ఫిజిక్స్‌-ఎలక్టాన్రిక్స్‌, మ్యాథ్స్‌-ఫిజిక్స్‌-కంప్యూటర్‌సైన్స్‌, మ్యాథ్స్‌-స్టాటిస్టిక్స్‌-కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌-కెమిస్ట్రీ-ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, మ్యాథ్స్‌-ఫిజిక్స్‌-జియాలజీ, మ్యాథ్స్‌-ఎలక్ట్రానిక్స్‌-జియాలజీ, జియాలజీ-ఫిజిక్స్‌-కెమిస్ట్రీ..మొదలైనవి.
అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం, బెంగళూరు ఆనర్స్‌ విధానంలో బీఎస్సీ ఫిజిక్స్‌, బీఎస్సీ మ్యాథ్స్‌ కోర్సులు అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. బీఎస్సీ అనంతరం ఎంపీసీ విద్యార్థులు ఐఐటీల్లో ఇంటిగ్రేటెడ్‌ పీహెచ్‌డీ, ఎమ్మెస్సీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చు. జామ్‌ ద్వారా ప్రవేశం లభిస్తుంది.

 

ఏకంగా పీజీతో..

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం వివిధ పీజీ కోర్సులను అందిస్తోంది. వీటి వ్యవధి అయిదేళ్లు. మ్యాథమేటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ కోర్సుల్లో ఎంపీసీ విద్యార్థులు చేరవచ్చు.  పాండిచ్చేరి సెంట్రల్‌ యూనివర్సిటీ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఎమ్మెస్సీ - అప్లైడ్‌ జియాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్‌ సైన్స్‌, హిస్టరీ, మ్యాథమేటిక్స్‌, ఫిజిక్స్‌, స్టాటిస్టిక్స్‌ కోర్సులు అందిస్తోంది.
కొత్తగా ఏర్పడిన 14 కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, లైఫ్‌ సైన్సెస్‌, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌, జాగ్రఫీ, జియాలజీ, ఎకనామిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు అందిస్తున్నాయి. సీయూ సెట్‌లో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఐఐటీల్లోనూ ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల్లో  పలు యూనివర్సిటీలు ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ అందిస్తున్నాయి.
ఆర్‌ఐఈ మైసూరులో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ ఆరేళ్ల కోర్సును మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో అందిస్తున్నారు.   అజీం ప్రేమ్‌ జీ యూనివర్సిటీ బీఎస్సీ (ఎంపీసీ) ఎడ్‌ కోర్సు అందిస్తోంది. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.

 

ఎయిర్‌ ఫోర్స్‌లో పైలట్‌గా..

పైలట్‌ శిక్షణకు ఇంటర్‌ ఎంపీసీ తప్పనిసరి. డీజీసీఏ అనుమతి పొందిన సంస్థల్లో తర్ఫీదు పొందినవారు విమాన చోదకుడిగా సేవలు అందించవచ్చు. ఇంటర్‌ ఎంపీసీ అర్హతతో ఎన్డీఏ ఎయిర్‌ ఫోర్స్‌ విభాగంలో ఎంపికైనవారు బీటెక్‌ చదువుతోపాటు పైలట్‌ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు.
పలు సంస్థలు యానిమే  షన్‌లో బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. ఆసక్తి ఉంటే బీఫార్మసీ కోర్సు చదువుకోవచ్చు.  బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషియన్‌ ఇంజినీరింగ్‌, బీటెక్‌ పెట్రోలియం ఇంజినీరింగ్‌  ఇలా కోర్సులెన్నో ఉన్నాయి.

 

పరిశోధకులు.. గణకులు
పరిశోధనలకు నెస్ట్‌

పరిశోధనా రంగంలో రాణించాలనుకునే ఇంటర్‌ సైన్స్‌ విద్యార్థులకు నేషనల్‌ ఎంట్రన్స్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ (నెస్ట్‌) మంచి అవకాశం. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎన్‌ఐఎస్‌ఈఆర్‌), భువనేశ్వర్‌; యూనివర్సిటీ ఆఫ్‌ ముంబయి, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీ విభాగానికి చెందిన సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ బేసిక్‌ సైన్సెస్‌ (సీఈబీఎస్‌)ల్లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. బేసిక్‌ సైన్సెస్‌, బయాలజీ, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది.

ఐఐఎస్‌ఈఆర్‌లో బీఎస్‌- ఎంఎస్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)లు తిరుపతి, బరంపురం, భోపాల్‌, కోల్‌కతా, మొహాలీ, పుణె, తిరువనంతపురంలో ఉన్నాయి. బీఎస్‌-ఎంఎస్‌ పేరుతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు బయలాజికల్‌ సైన్సెస్‌, కెమికల్‌ ఇంజినీరింగ్‌, కెమిస్ట్రీ, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్సెస్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ అందిస్తున్నారు.(ఐఐఎస్‌ఈఆర్‌ భోపాల్‌లో ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌ కోర్సులు సైతం ఉన్నాయి).

ఐఐఎస్‌సీ
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌  నాలుగేళ్ల వ్యవధితో బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (రిసెర్చ్‌) కోర్సులు నిర్వహిస్తోంది. కోర్సులో చేరినవారు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, బయాలజీ, మెటీరియల్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌ వీటిలో ఏ సబ్జెక్టునైనా స్పెషలైజేషన్‌గా తీసుకోవచ్చు.

మ్యాథ్స్‌కు సీఎంఐ
చెన్నై మ్యాథమేటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ గణితంలో యూజీ కోర్సులకు దేశంలో ప్రముఖ సంస్థగా గుర్తింపు పొందింది. బీఎస్సీ (ఆనర్స్‌)- మ్యాథ్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌; బీఎస్సీ (ఆనర్స్‌)-మ్యాథ్స్‌, ఫిజిక్స్‌ మూడేళ్ల కోర్సులు ఇక్కడ చదువుకోవచ్చు.
స్టాటిస్టిక్స్‌కు ఐఎస్‌ఐ
స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, ఎకనామిక్స్‌ కోర్సులపై ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఐఎస్‌ఐ) కోల్‌కతా క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (బీ స్టాట్‌) కోర్సు అందిస్తోంది. బెంగళూరు క్యాంపస్‌లో ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ ఆఫ్‌ మ్యాథమేటిక్స్‌ (బీ మ్యాథ్స్‌) కోర్సు నిర్వహిస్తున్నారు. కోర్సుల వ్యవధి మూడేళ్లు.

ఫ్యాషన్‌ టెక్నాలజీకి నిఫ్ట్‌
దేశంలో ఫ్యాషన్‌ కోర్సులకు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌)లు పేరొందిన సంస్థలు. హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా 16 చోట్ల వీటిని నెలకొల్పారు. వీటిలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌టెక్‌ )- అపారెల్‌ ప్రొడక్షన్‌ కోర్సులో ఉమ్మడి పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంపీసీ విద్యార్థులు ఈ కోర్సులో చేరడానికి అర్హులు. పలు సంస్థలు బీటెక్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులు నిర్వహిస్తున్నాయి.

ఇతర కోర్సులు
సైన్స్‌ కాకుండా ఇతర మార్గాల్లోకి ప్రవేశించాలనుకునే ఎంపీసీ విద్యార్థులకు మరెన్నో కోర్సులు ఉన్నాయి.లా, డీఎడ్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సీఏ, సీడబ్ల్యుఏ, సీఎస్‌ మొదలైనవాటిని పరిశీలించవచ్చు. ఎకనామిక్స్‌, పాలిటీ, హిస్టరీ, ఆంత్రోపాలజీ, సోషియాలజీ, టూరిజం స్టడీస్‌ తదితర సబ్జెక్టులతో డిగ్రీలు చేసుకోవచ్చు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.