close

తాజా వార్తలు

‘ఎవరెస్ట్‌’కు మూడు దేశాల మహిళా బృందం!

కాఠ్‌మాండూ: ఎవరెస్ట్‌ చరిత్రలో మొదటిసారిగా మూడు దేశాలకు చెందిన ముగ్గురు మహిళలతో కూడిన బృందం అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించడానికి సిద్ధమవుతోంది. భారత్ నుంచి కల్పనా దాస్‌, నేపాల్‌ నుంచి కంచి మాయా తమాంగ్‌, చైనా నుంచి లియాము మాతో కూడిన ఈ బృందం ఈ యాత్రకు శ్రీకారం చుట్టింది. మహిళా సాధికారతపై ప్రపంచానికి సందేశమివ్వడంతో పాటు ప్రపంచ శాంతి, స్నేహం కోసం ఈ సాహసానికి సిద్ధమైనట్లు పర్వతారోహకులు తెలిపారు. నేపాల్‌ టూరిజం బోర్డు ప్రోత్సాహం అందిస్తున్న ఈ సాహస యాత్రను కాఠ్‌మాండూలో ప్రారంభించారు. 8,848 మీటర్ల ఎత్తుగల ఎవరెస్టు శిఖరాన్ని ఈ బృందం అధిరోహించనుంది. ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకురాలు, ఆరుసార్లు గిన్నిస్‌ రికార్డు విజేతగా నిలిచిన పెంబ డోర్జె షెర్పా ఈ ముగ్గురికి మార్గనిర్దేశం చేయనున్నారు. ఇలాంటి యాత్ర ఎవరెస్టు చరిత్రలో నిర్వహించడం ఇదే తొలిసారని నేపాల్‌ టూరిజం బోర్డు తెలిపింది. ఈ ముగ్గురు ఇంతకుముందే ఎవరెస్టును అధిరోహించారు . 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.