close

తాజా వార్తలు

రకుల్‌.. ఎంత మంది ప్రపోజ్‌ చేశారు?

‘రాజమౌళితో పనిచేసే అవకాశం వస్తే?’
నెటిజన్లతో నటి ముచ్చట్లు

దక్షిణాదితోపాటు ఉత్తరాదిలోనూ కథానాయికగా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఈ ప్రయత్నంలో ఇప్పటికే ఆమె బాలీవుడ్‌లో తొలి మెట్టు ఎక్కేశారు. కథానాయకుడు అజయ్‌ దేవగణ్‌కు జంటగా రకుల్‌ నటించిన ‘దే దే ప్యార్‌ దే’ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయం అందుకుంది. ఈ చిత్రం కేవలం నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా రూ.44.73 కోట్లు రాబట్టింది. మరోపక్క కోలీవుడ్‌లో సూర్య సరసన రకుల్ నటించిన ‘ఎన్జీకే’ సినిమా మే 31న విడుదల కాబోతోంది. అగ్ర కథానాయకుడు నాగార్జున నటిస్తున్న ‘మన్మథుడు 2’లో ఆమె కథానాయిక పాత్ర పోషిస్తున్నారు. అదేవిధంగా బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్టుకు కూడా సంతకం చేశారు. ‘దే దే ప్యార్‌ దే’ సినిమాకు మంచి స్పందన అందిన నేపథ్యంలో రకుల్‌ ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించారు. వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఆ విశేషాలివి..

మీ జీవితంలో గర్వంగా చెప్పుకునే క్షణాలు?
రకుల్‌: నా తల్లిదండ్రులు నన్ను చూసి గర్వించే ప్రతి క్షణం.. ఆ సమయంలో నేను సరైన దారిలో వెళ్తున్నాననే భావన కల్గుతుంది.
మీకు ఇష్టమైన ప్రదేశం?
రకుల్‌: స్నేహితులు ఉన్న ఏ ప్రదేశమైనా నాకు ఇష్టమే. నాకు వెళ్లే చోటుకన్నా నాతో ఉండే మనుషులు ఎవరన్నదే ముఖ్యం.
సమంత గురించి చెప్పండి?
రకుల్‌: నాకు సమంత అంటే ఇష్టం. ఆమె పవర్‌ ఉమన్‌.

మీకు ఇష్టమైన పాట?
రకుల్‌: ప్రస్తుతానికి నా మైండ్‌లో ‘దే దే ప్యార్‌ దే’ పాటలే ఉన్నాయి.
అజయ్‌ దేవగణ్‌ గురించి చెప్పండి?
రకుల్‌: సెక్యూర్‌ యాక్టర్‌, అద్భుతమైన వ్యక్తి.
మీకు ఇష్టమైంది?
రకుల్‌: నటన.
సిద్ధార్థ్‌ మల్హోత్రా గురించి ఒక్క మాటలో చెప్పండి?
రకుల్‌: చాలా కష్టపడే వ్యక్తి.

సూర్యతో కలిసి మరోసారి పనిచేస్తారా?
రకుల్‌: సరైన కథ వస్తే చేస్తా. ఆయనతో నటన మంచి అనుభవాన్ని ఇస్తుంది.
‘దే దే ప్యార్‌ దే’ సినిమాను బాగా ప్రచారం చేశారు? అంతలా ఎప్పుడూ దక్షిణాది చిత్రం కోసం చేయలేదు. దీనికి కారణం అది బాలీవుడ్‌ చిత్రం కావడమేనా?
రకుల్‌: బాలీవుడ్‌లో ప్రమోషనల్‌ ప్లాన్‌ను ఫాలో అవుతారు. దక్షిణాదిలోనూ దాన్ని ఫాలో అయితే... ఇక్కడ కూడా అదే స్థాయిలో ప్రచారంలో పాల్గొంటాను.
విహారయాత్రకు మీరు ఎంచుకునే ప్రదేశం?
రకుల్‌: లండన్‌.
మీ అందం రహస్యం?
రకుల్‌: ధన్యవాదాలు.. సంతోషంగా ఉండమే.
అజిత్‌తో కలిసి నటిస్తారా?
రకుల్‌: నటిస్తా.. ఆయనతో పనిచేయాలని నాకూ ఉంది.
మీరు ఎప్పుడూ అంత ప్రశాంతంగా ఎలా ఉంటారు?
రకుల్‌: నా తల్లిదండ్రుల డీఎన్‌ఏ.

అల్లు అర్జున్‌ గురించి చెప్పండి?
రకుల్‌: నాకు తెలిసిన వారిలో ఓ మంచి వ్యక్తి.
అజయ్‌ దేవగణ్‌ సినిమాల్లో మీకు ఇష్టమైంది?
రకుల్‌: సింగం.
పాఠశాలలో చదివే రోజుల్లో మీరు హీరోయిన్‌ అవుతారని ఎప్పుడైనా అనుకున్నారా?
రకుల్‌: లేదు.. అప్పుడు నేను చిన్న అమ్మాయిని. కానీ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడు హీరోయిన్‌గా ప్రయత్నించాలి అనుకున్నా.

సాయిపల్లవి గురించి ఒక్క మాట?
రకుల్‌: చాలా సహజంగా ఉంటుంది. నైపుణ్యం, శ్రమించే గుణం ఉన్న అమ్మాయి.
రకుల్‌ మీకు ఫిట్‌నెస్‌ సెంటర్లు ఉన్నాయి కదా. మీ అందం, ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న రహస్యం చెప్పండి..
రకుల్‌: క్రమశిక్షణ, మిమ్మల్ని మీరు ప్రేమించండి.
దక్షిణాదిలో మీకు ఇష్టమైన ఆహారం?
రకుల్‌: అప్పం.
మీకు ముగ్గురు ఖాన్‌లతో నటించే అవకాశం వస్తే.. ఎవరితో కలిసి ముందు పనిచేస్తారు?
రకుల్‌: నన్ను ముందు సంప్రదించిన వారితో.. నాకు ముగ్గురు ఖాన్‌లతోనూ పనిచేయాలని ఉంది.
మీకు ఇష్టమైన నటీమణులు?
రకుల్‌: చాలా మంది ఉన్నారు.. ఆలియా భట్‌, అనుష్క శర్మ, కాజోల్‌ మామ్‌ అంటే ఇష్టం.
ఒత్తిడిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు?
రకుల్‌: నా స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి సమయం గడుపుతా.

రాజమౌళి సర్‌తో కలిసి పనిచేసే అవకాశం వస్తే మీరు ఎలా రియాక్ట్‌ అవుతారు?
రకుల్‌: వెంటనే సంతకం చేసేస్తా (నవ్వుతూ).
‘మన్మథుడు 2’ షూటింగ్‌ ఎలా జరుగుతోంది?
రకుల్‌: అద్భుతంగా జరుగుతోంది. సెట్‌ మొత్తం ఫన్‌, పాజిటివిటీతో నిండిపోయి ఉంటోంది.
సూపర్‌ హీరోస్‌లో మీకు ఇష్టమైన వారు?
రకుల్‌: ఐరన్‌ మ్యాన్‌.

మీ కోరికల్లో ఒకటి?

రకుల్‌: నేను బాగా తినాలి.. కానీ బరువు పెరగకూడదు.
మీకు ఇంత వరకు ఎంత మంది ప్రపోజ్‌ చేశారు?
రకుల్‌: ఒక్కరు కూడా ప్రపోజ్‌ చేయలేదు (డల్‌గా ఉన్న ఎమోజీ).
మీ అభిమానులకు ఏదైనా సలహా ఇవ్వండి?
రకుల్‌: సలహా కాదు.. వారు నాపై చూపుతున్న అమితమైన ప్రేమకు ధన్యవాదాలు.

- ఇంటర్నెట్‌డెస్క్‌ 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.