Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113395
            [news_title_telugu_html] => 

పుల్వామాలో మరో ఉగ్రదాడి!

[news_title_telugu] => పుల్వామాలో మరో ఉగ్రదాడి! [news_title_english] => Army Vehicle Attacked In Jammu And Kashmirs Pulwama Encounter Underway [news_short_description] => జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పుల్వామా సమీపంలో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని... [news_tags_keywords] => PULWAMA,Indian Army,JammuKashmir [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-18 00:41:12 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పుల్వామాలో మరో ఉగ్రదాడి! - Army Vehicle Attacked In Jammu And Kashmirs Pulwama Encounter Underway - EENADU
close

తాజా వార్తలు

పుల్వామాలో మరో ఉగ్రదాడి!

పుల్వామా: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. పుల్వామా సమీపంలో ఆర్మీ వాహనాన్ని లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. అరిహల్‌ గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటనలో 44 రాష్ట్రీయ రైఫిల్స్‌కు చెందిన వాహనం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆపరేషన్‌ కొనసాగుతోంది. అనంత్‌నాగ్‌ జిల్లా అచ్‌బల్‌ ప్రాంతంలో  ఉగ్రవాదులపై కాల్పులు జరిగిన కొద్ది సేపటికే  ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అచ్‌బల్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో  ఓ ఆర్మీ మేజర్‌ అమరుడు కాగా.. మరో ముగ్గురు జవాన్లకు తీవ్రగాయాలయ్యాయి.

గత ఫిబ్రవరిలో ఇదే ప్రాంతంలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్‌, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.