close

తాజా వార్తలు

వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ

ఒకరికి గాయాలు

నాదెండ్ల: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతూరులో వైకాపాలోని రెండు వర్గాల మధ్య బుధవారం ఉదయం ఘర్షణ చోటుచేసుకుంది. సాతూరు గ్రామంలో మీసేవా కేంద్రం నిర్వహణ విషయంలో మాజీ సర్పంచ్‌ పోపూరి విద్యారాణి, ఉడతా వెంకటేశ్వరరావు వర్గీయులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో మాజీ సర్పంచ్‌పై వెంకటేశ్వరరావు వర్గీయులు చేయిచేసుకోవడంతో ఆమె కిందపడిపోయారు. వారిని అడ్డుకోబోయిన విద్యారాణి మరిది ప్రసాద్‌పై కూడా దాడిచేయడంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.