close

తాజా వార్తలు

కాంగ్రెస్‌ పిటిషన్‌ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు

న్యూదిల్లీ: సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌ షా, స్మృతి ఇరానీ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్‌లో ఖాళీ అయిన ఈ రెండు సీట్లకు గానూ వేర్వేరుగా ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్న విషయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు మంగళవారం తోసి పుచ్చింది. అయితే, ఈ రెండు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగిన అనంతరం ‘ఎన్నికల పిటిషన్‌’ వేయవచ్చని కాంగ్రెస్‌కు జస్టిస్ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ బీఆర్‌ గవాయీతో కూడిన ధర్మాసనం సూచించింది. 

సుప్రీంకోర్టులో ఈ పిటిషన్‌ను కాంగ్రెస్‌ గుజరాత్ ఎమ్మెల్యే పరేశ్‌భాయి ధనానీ వేశారు. ‌ఈ రెండు రాజ్యసభ స్థానాలకు వేర్వేరుగా నోటిఫికేషన్‌లు విడుదల చేసి ఎన్నికలు నిర్వహించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 14ను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపారు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్‌ను తోసిపుచ్చుతూ ఇందులో జోక్యం చేసుకోబోమని, ఇప్పటికే ఈ రెండు రాజ్యసభ స్థానాల కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిందని గుర్తు చేసింది. కాగా, జూన్‌ 23న ఈ విషయంపై సుప్రీంకోర్టుకి ఈసీ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. గుజరాత్‌లోని ఈ రెండు సీట్లకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం చట్టవిరుద్ధం కాదని, 1957 నుంచి అనుసరిస్తున్న ప్రక్రియనే తాము ఇప్పుడు కూడా అనుసరిస్తున్నామని తెలిపింది. ‌ ‌  


 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.