close

తాజా వార్తలు

పాముతో వచ్చి చికిత్సకు ప్రాధేయపడి


పామును పట్టుకుంటున్న పాములు పట్టే వ్యక్తి

బిచ్కుంద, న్యూస్‌టుడే(కామారెడ్డి): బిచ్కుంద మండల కేంద్రంలో మద్యం మత్తులో ఓ యువకుడు పామును ఆసుపత్రిలో వదిలి వేయడం కలకలం రేపింది. బుధవారం రాత్రి చిన్నదేవాడకు చెందిన పండరికి (32) బిచ్కుందలో పాము కాటు వేసింది. మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు కోపంతో పామును పట్టుకొని బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. ఆ సమయంలో అక్కడ సిబ్బంది లేక పోవడంతో ఆగ్రహం చెందిన బాధితుడు పామును అక్కడే ఉన్న చెత్తబుట్టలో వేశాడు. ఈ పరిణామంతో భయందోళనకు గురైన ఆసుపత్రి సిబ్బంది 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది పాము కాటుకు గురైన వ్యక్తిని బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. పాములు పట్టే వ్యక్తి వచ్చి ఆసుపత్రిలో వదిలేసిన పామును తీసుకొని పోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.