close

తాజా వార్తలు

ధోనీ అర్ధశతకం.. చెన్నై 175/5

చెన్నై: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఆదిలోనే మూడు కీలక వికెట్లు కోల్పోయిన ఆ జట్టును రైనా, ధోనీ ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 61 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే రైనా 36 పరుగులు చేసి ఉనద్కత్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన బ్రావోతో కలిసి ధోనీ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. ఇద్దరూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే ధోనీ అర్ధశతకం పూర్తిచేశాడు. అనంతరం 19వ ఓవర్లో బ్రావో 27 ఔట్‌కాగా రవీంద్ర జడేజా క్రీజులోకి వచ్చాడు. చివరి ఓవర్‌లో ధోనీ మూడు సిక్సులు బాదడంతో చెన్నై 175 పరుగులు చేసింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.