
తాజా వార్తలు
బెంగళూరు : మిస్టర్ 360º° మరోసారి తన బ్యాటింగ్ విన్యాసాలతో అభిమానులను అలరించాడు. చిన్నస్వామి మైదానం వేదికగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ మెరుపులు మెరిపించాడు. 44 బంతుల్లోనే 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మైదానంలో నలువైపులా సిక్సులు కొట్టే ఏబీ.. తాజాగా ఒంటి చేత్తో సిక్సర్ బాదాడు. డివిలియర్స్ దెబ్బకు బంతి మైదానం బయటికి వెళ్లి పోయింది. ఈ షాట్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమంలో వైరల్ అయింది. ‘ఏబీ.. నువ్వు నిజంగా వేరే గ్రహం నుంచి వచ్చావని మరోసారి నిరూపించావ్’ అని అభిమానులు పేర్కొంటున్నారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన బెంగళూరు బ్యాట్స్‌మెన్ విజృంభించడంతో ఆ జట్టు 202 భారీ స్కోరు చేసింది. అయితే, 19వ ఓవర్లో షమీ వేసిన ఐదో బంతి డివిలియర్స్ శరీరం మీదకి వచ్చింది. ఆ బంతిని ఏబీ ఒంటి చేత్తో సిక్సర్‌గా మలిచాడు. దీంతో బంతి వెళ్లి మైదానం బయట పడింది. నడుముకంటే ఎత్తులో వచ్చినా ఆ బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించలేదు. దీంతో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీ అంపైర్ల నిర్ణయంపై కాస్త అసహనం వ్యక్తం చేస్తూ కనిపించాడు. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు బాదిన ఏబీ మొత్తం 21 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాతి ఓవర్లో 27 పరుగులు చేసి బెంగళూరు స్కోరును 200 పరుగులు దాటించారు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు 17 పరుగుల తేడాతో విజయం సాధించింది.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- మాకొద్దీ ఉద్యోగం!
- ఆయనే లోకమన్నది.. అంతలోనే అంతమైంది
- నిత్యానందా.. నీ దేశానికి వీసా ఎలా?
- నోట్లో దుస్తులు కుక్కి వివాహితపై అత్యాచారం
- విండీస్ వీరులారా.. ఓ విన్నపం!
- ఎందుకా పైశాచికం?
- కదులుతున్న కారులోనే లైంగిక దాడి
- ఆ పాట నా ఇమేజ్ను పూర్తిగా మార్చేసింది!
- ‘బుమ్రా నా ముందొక బేబీ బౌలర్’
- ఆలియా మెచ్చిన తెలుగు హీరో..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
