close

తాజా వార్తలు

మరో ప్రపంచ రికార్డుకు చేరువలో కోహ్లీ

న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో చేరుకుంటాడా?

నాటింగ్‌హామ్‌: టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ధావన్‌ గాయం కారణంగా మరో రెండు మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌.. రోహిత్‌శర్మతో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం వచ్చింది. అయితే ఓపెనర్‌గా రాహుల్‌ ఏమేరకు రాణిస్తాడో చూడాల్సి ఉంది. మరోవైపు ధావన్‌ అందుబాటులో లేకపోవడంతో రోహిత్‌శర్మ, కెప్టెన్‌ కోహ్లీలపై మరింత భారం పెరిగింది. కోహ్లీకి ఒత్తిడిలో ఆడటం కొత్త కాకపోయినా ప్రస్తుతం న్యూజిలాండ్‌ పేసర్లను ఎదుర్కోవడం అంత తేలిక కాదు. ఈ ప్రపంచకప్‌లో ట్రెంట్‌బోల్ట్‌, లోకీ ఫెర్గూసన్‌, మ్యాట్‌ హెన్రీ తమ బౌలింగ్‌తో చెలరేగిపోతున్నారు.

దీంతో కోహ్లీ వీరిని ఎదుర్కొని నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటికే అత్యంత వేగంగా పదివేల పరుగుల మైలురాయి చేరుకున్న కోహ్లీ న్యూజిలాండ్‌తో జరగబోయే మ్యాచ్‌లో మరో 57 పరుగులు చేస్తే 11 వేల మార్కును చేరుకుంటాడు. ఇప్పటి వరకు 221 ఇన్నింగ్స్‌లో10943 పరుగులు పూర్తిచేసిన అతడు అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టి 11 ఏళ్లు కూడా గడవకముందే ఈ మైలురాయిని చేరుకొని రికార్డు సృష్టించనున్నాడు. దీంతో ప్రపంచవ్యాప్తంగా 11 వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌లో కోహ్లీ 9వ స్థానంలో నిలవగా భారత్‌ తరఫున మూడో ఆటగాడిగా కొనసాగుతాడు. అతడి కన్నా ముందు సచిన్‌, గంగూలీ ఈ మైలు రాయిని చేరుకున్నారు. 

కాగా ఈ ప్రపంచకప్‌లో కోహ్లీ చెలరేగితే దాదా అత్యధిక పరుగుల (11363) రికార్డును అధిగమించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఈ రోజు న్యూజిలాండ్‌పై శతకం సాధిస్తే మాత్రం వీరేందర్‌ సెహ్వాగ్‌, రికీపాంటింగ్‌లతో సమానంగా ఆ జట్టుపై ఆరు శతకాలు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలుస్తాడు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.