
తాజా వార్తలు
లండన్: ఇంగ్లాండ్ జట్టు ప్రపంచకప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ జేసన్ రాయ్‌కు టెస్టు జట్టు నుంచి పిలుపు అందింది. లార్డ్స్ వేదికగా ఈ నెల 24న ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య ఒక టెస్టు మ్యాచ్ జరగనుంది. దీనికిగానూ సెలక్టర్లు తాజాగా ప్రకటించిన జట్టులో జేసన్ రాయ్ స్థానం దక్కించుకున్నాడు. ఈ టెస్టులో అతను మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటే త్వరలో జరగనున్న యాషెస్ సిరీస్‌లోనూ చోటు దక్కే అవకాశం ఉంది. ప్రపంచకప్ ఫైనల్ విజయంలో కీలకపాత్ర పోషించిన బెన్‌స్టోక్స్, బట్లర్‌కు మాత్రం ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విశ్రాంతినిచ్చారు.
2015లో వన్డే అరంగేట్రం చేసిన రాయ్ ఇప్పటివరకూ 83 మ్యాచ్‌లాడి 3381 పరుగులు చేశాడు. టీ20ల్లో 32 మ్యాచ్‌ల్లో 743 పరుగులు చేసిన ఈ కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లోనే టెస్టు అరంగేట్రం చేయనున్నాడు.
Tags :
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- ‘న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి’
- పెళ్లైన ఏడాదికే భర్తతో విడిపోయిన శ్వేతా బసు
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- ‘వెంకీ మామ’ టీంతో రానా ముచ్చట్లు
- ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ఫొటో వైరల్!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
