close

తాజా వార్తలు

‘చిత్ర’ వార్తలు

ఛత్రపతికి నమో నమామి


మహారాష్ట్ర నాసిక్‌లో గురువారం నిర్వహించిన ‘విజయ్‌ సంకల్ప్‌ ర్యాలీ’ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. త్వరలో
మహారాష్ట్రలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాని మోదీ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి దేవేంద్ర
ఫడణవీస్‌ను మోదీ అభినందించారు. భాజపాకు పూర్తిస్థాయి మెజారిటీ లేకున్నా అయిదు సంవత్సరాలు విజయవంతంగా సుస్థిరమైన ప్రభుత్వాన్ని నడిపారని
పేర్కొన్నారు. 

ప్రేక్షకులకు కనులపండగే!

ఆహా! ఎంత అందమైన ప్రకృతి. ఏ విదేశమో అనుకుంటున్నారా? ఇంతకు ఆ సుందర దృశ్యాలను తన ఫోన్‌ కెమెరాలో బంధిస్తున్న నటుడు ఎవరో గుర్తుపట్టారా..?
అతడే సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌. మారుతీ దర్శకత్వంలో నటిస్తున్న ‘ప్రతిరోజూ పండగే’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం విజయనగరం జిల్లా కోరుకొండలోని
లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో జరుగుతోంది. ఈ చిత్రాలను దర్శకుడు మారుతీ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇటువంటి అందమైన లోకేషన్లలో చిత్రీకరణ
జరుపుకొంటున్నది అంటే ప్రేక్షకులకు కన్నులపండువ ఖాయంగా కన్పిస్తుంది. చిత్రంలో రాశీఖన్నా కథానాయిక, సత్యరాజ్‌ కీలకపాత్రలో నటిస్తున్నారు. 

నిలిచిన ప్రజారవాణా!


కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వాహన చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో ప్రైవేటు వాహనదారులు ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చారు. దీంతో దిల్లీ, నొయిడాలలో
ఆటోలు, క్యాబ్‌లు, ప్రైవేటు బస్సులు, లారీల రాకపోకలు నిలిచిపోయాయి. దిల్లీలో పలు పాఠశాలలకు గురువారం సెలవు ప్రకటించారు. గురువారం ఉదయం 6 గంటల
నుంచి రాత్రి 10 గంటల వరకు సమ్మె నిర్వహిస్తున్నట్లు వాహన యాజమానుదారుల సంఘాలు ప్రకటించాయి. ఇళ్ల నుంచి బస్టాఫ్‌లకు, కార్యాలయాలకు వెళ్లేందుకు ఆటోలు అందుబాటులో లేవు. దీంతో దిల్లీ, నొయిడాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. విమానాశ్రయాలకు వెళ్లేవారికి క్యాబ్‌లు దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో 2-3 గంటలు ముందుగానే బయలుదేరాల్సి వచ్చింది.

కర్నూలులో లావణ్య సందడి!


సినీ నటి లావణ్య త్రిపాఠి కర్నూలు నగరంలో సందడి చేశారు. కర్నూలు సిటీ స్క్వేర్‌ మాల్‌లో ఓ షాపింగ్‌ మాల్‌ను ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన చేసిన అనంతరం
చిన్నారులతో కలిసి కేక్‌ కట్‌ చేశారు. మాల్‌లో తిరుగుతూ వస్త్రాలను పరిశీలించారు.

ఐఫా అందాలు!


ముంబయిలో నిర్వహించిన ఐఫా-2019 అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. కార్యక్రమంలో పలువురు బాలీవుడ్‌ ప్రముఖులు సందడి చేశారు. ఉత్తమ నటిగా
ఆలియా భట్‌ (రాజీ), ఉత్తమ నటుడుగా రణవీర్‌సింగ్‌ (పద్మావత్‌) ఎంపికయ్యారు.

బతుకమ్మ చీరలొచ్చాయి!


తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం ఉచితంగా చీరలు అందజేస్తుంది. దీనికి సంబంధించి రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల
మంత్రి కేటీఆర్‌ మీడియా సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్‌ 23 నుంచి కోటి చీరలు పంపిణీ చేయనున్నారు. పది రకాల రంగులతో వంద డిజైన్లతో కోటి చీరలు సిద్ధం
చేశామని మంత్రి పేర్కొన్నారు. చీరలకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.313 కోట్లు ఖర్చు చేసిందని, చేనేత కార్మికులకు మరింత ఉపాధి దొరికిందని కేటీఆర్‌ తెలిపారు.

అమర జవాన్ల స్ఫూర్తితో..


ప్రముఖ ఆన్‌లైన్‌ స్ట్రీమింగ్‌ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌ బాలీవుడ్‌ నటుడు ఇమ్రాన్‌ హష్మీ కథానాయకుడిగా ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ పేరుతో వెబ్‌సిరీస్‌ రూపొందించింది. రిభు దాస్‌గుప్తా
దర్శకత్వం వహిస్తుండగా నటి కీర్తి కుల్హారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ చిత్ర బృందం దిల్లీలోని అమర్‌ జవాన్‌ జ్యోతి వద్ద గురువారం నివాళులర్పించింది. ఎనిమిది
భాగాల ‘బార్డ్‌ ఆఫ్‌ బ్లడ్‌’ ఓ మాజీ రా అధికారి కథగా తెలుస్తోంది. సెప్టెంబర్‌ 27న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానుంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.