
తాజా వార్తలు
న్యూయార్క్: తనకు నోబెల్ శాంతి బహుమతి ఇప్పటికే రావాల్సిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నోబెల్ కమిటీ తనకు అన్యాయం చేసిందని ఆరోపించారు. పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌తో జరిపిన ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తాను శాంతి స్థాపనకోసం చాలా పనులు చేశానని చెప్పుకొచ్చారు. అంతటితో ఆగకుండా.. 2009లో ఒబామాకు నోబెల్ దేనికోసం ఇచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అధ్యక్ష పదవి చేపట్టిన కొన్నిరోజులకే ఆయనకిచ్చారని.. ఎందుకిచ్చారో కూడా ఒబామాకు తెలియదని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టినందుకుగానూ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే. ఇమ్రాన్‌ఖాన్‌తో భేటీ సందర్భంగా కశ్మీర్ అంశం చర్చకు వచ్చిన సందర్భంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్-పాక్ అంగీకరిస్తే కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవడంలో తాను సహకరిస్తానని ఈ సందర్భంగా మరోసారి ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం.
స్పోర్ట్స్
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- 8 మంది.. 8 గంటలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
- నాకు సంబంధం ఉందని తేలితే ఉరేసుకుంటా
ఎక్కువ మంది చదివినవి (Most Read)
