close

తాజా వార్తలు

మాజీ క్రికెటర్‌పై చీటింగ్‌ కేసు


 

దిల్లీ:  మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌, అతడి కుటుంబసభ్యులపై గురువారం చీటింగ్‌ కేసు నమోదైంది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. లండన్‌లో నివసించే సంధ్య శర్మ పండిట్‌ అనే మహిళ పోలీసులకు ఈ ఫిర్యాదు చేశారు. దిల్లీలోని సర్వప్రియ విహార్‌ అపార్ట్‌మెంట్‌లో తనకు ఫ్లాట్‌ ఉందన్నారు.  తప్పుడు పత్రాలు సృష్టించి మాజీ క్రికెటర్‌ మనోజ్‌ ప్రభాకర్‌, అతడి కుటుంబసభ్యులు దానిని ఆక్రమించుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. 
2006 వరకు భర్తతో కలిసి ఆ ఫ్లాట్‌లోనే ఉన్నామని, తర్వాత లండన్‌కు వెళ్లిపోయామని సంధ్య తెలిపారు.  అప్పటి నుంచి 2018 వరకు ఆ ఇంటిలో తమ బంధువులు ఉండేవారని, వారు కొద్ది కాలం క్రితం ఖాళీ చేశారన్నారు. ఆ తర్వాత అందులో ఎవరో ఉంటున్నారని పక్క ఫ్లాట్ల వాళ్లు తనకు ఫోన్‌ చేసి చెప్పారన్నారు. విషయం తెలుసుకునేందుకు దిల్లీకి రాగా తనను ఇంటిలోకి రాకుండా అడ్డుకున్నారని ఆమె వాపోయారు. ఈ విషయం గురించి ఇంట్లో ఉంటున్నవారిని అడగ్గా.. మనోజ్‌ ప్రభాకర్‌ నుంచి బెదిరింపులు వచ్చాయని తెలిపారు. మనోజ్‌ గోయల్‌ అనే వ్యక్తితో కలిసి మనోజ్‌ ప్రభాకర్‌ తప్పుడు పత్రాలు సృష్టించి తన ఫ్లాట్‌ను వినియోగించుకుంటున్నారని ఆమె ఆరోపించారు.

అయితే ఈ ఆరోపణలను మాజీ క్రికెటర్‌ ఖండించారు. గత 23 ఏళ్లుగా అదే అపార్ట్‌మెంట్‌లో కింద ఫ్లాట్‌లో నివసిస్తున్నామని, ఆమెను ఎప్పుడూ చూడలేదన్నారు. ఆమె కావాలనే తన ప్రతిష్ఠను దిగజార్చటానికి ఈ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.