close

తాజా వార్తలు

రాహుల్‌-మయాంక్‌ జోరు

బెంగళూరు: మనీశ్‌ పాండే సారథ్యంలోని కర్ణాటక జట్టు విజయకేతనం ఎగరేసింది. విజయ్‌ హజారే టోర్నీ 2019-20 విజేతగా ఆవిర్భవించింది. నాలుగోసారి ట్రోఫీ అందుకొని మురిసింది. ఫైనల్లో వర్షం రావడంతో వీజేడీ పద్ధతిలో తమిళనాడుపై మనీశ్‌ సేన 60 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 253 పరుగుల లక్ష్య ఛేదనలో లోకేశ్ రాహుల్‌ (52; 72 బంతుల్లో 5×4), మయాంక్‌ అగర్వాల్‌ (69; 55 బంతుల్లో 7×4, 3×6) అర్ధశతకాలతో అజేయంగా నిలవడంతో 23 ఓవర్లకు ఆ జట్టు 146/1తో నిలిచింది. అకస్మాత్తుగా వర్షం రావడంతో అంపైర్లు మ్యాచ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎక్కువసేపు వర్షం కురవడంతో ఓవర్లు కుదించాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో పరిస్థితిని సమీక్షించిన అంపైర్లు వీజేడీ పద్ధతిలో 23 ఓవర్లకు చేయాల్సిన 86/1 కన్నా కర్ణాటక ఎక్కువ పరుగులే చేయడంతో విజేతగా ప్రకటించారు. దేవదత్‌ పడిక్కల్‌ (11; 14 బంతుల్లో 2×4)ను వాషింగ్టన్‌ సుందర్‌ బౌల్డ్‌ చేశాడు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన తమిళనాడును కర్ణాటక బౌలర్లు 252కు కట్టడి చేశారు. జట్టు స్కోరు 1 వద్దే ఓపెనర్‌ మురళీ విజయ్‌ (0)ను మిథున్‌ పెవిలియన్‌ పంపించాడు. ఈ క్రమంలో మరో ఓపెనర్‌ అభినవ్‌ ముకుంద్‌ (85; 110 బంతుల్లో 9×4), బాబా అపరాజిత్‌ (66; 84 బంతుల్లో 7×4) నిలకడగా ఆడుతూ అర్ధశతకాలు సాధించారు. విజయ్‌ శంకర్‌ (38; 25 బంతుల్లో 2×4, 1×6), షారుక్‌ ఖాన్‌ (27) పర్వాలేదనిపించారు. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ (11) విఫలమయ్యాడు. అభిమన్యు మిథున్‌ 5 వికెట్లతో తమిళనాడు వెన్ను విరిచాడు. తన పుట్టిన రోజునే హ్యాట్రిక్‌ తీసిన కర్ణాటక తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.