
తాజా వార్తలు
దిల్లీ: దేశ రాజధాని నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తాను ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్న శునకాన్ని రాళ్లతో కొట్టాడని ఓ వ్యక్తిని కాల్చి చంపేశాడు. పోలీసు అధికారి అతుల్ ఠాకూర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆఫాక్ అనే వ్యక్తి దిల్లీలోని వెల్కమ్ కాలనీలో నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ఇంటి ముందు ఉన్న కుక్క అతడిని కరవడానికి ప్రయత్నించింది.
భయంతో తప్పించుకునే ప్రయత్నంలో ఆఫాక్ దాని మీద రాళ్లు విసిరాడు. దీంతో యజమాని ఇంటి నుంచి బయటికి వచ్చి సదరు వ్యక్తితో గొడవకు దిగాడు. వాదన తారస్థాయికి చేరడంతో ఇంటి లోపలికి వెళ్లి తుపాకీతో బయటకు వచ్చి ఆఫాక్‌పై ఒక్కసారిగా కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధరించారు. శునకం యజమాని పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- వైకాపాను నమ్మి మోసపోయారు:చంద్రబాబు
- కాకినాడలో పవన్ దీక్ష పేరు ఖరారు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- ఆ సంగతి తర్వాత చూద్దాం: రోహిత్
- 8 మంది.. 8 గంటలు
- సంజు శాంసన్ కోసం శశి థరూర్ ఆవేదన
ఎక్కువ మంది చదివినవి (Most Read)
