
తాజా వార్తలు
అమరావతి: ఓట్ల తొలగింపునకు సంబంధించిన ఫారం-7 దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)కు, ఈసీకి సంబంధం లేదని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రధానాధికారి గోపాల్ కృష్ణ ద్వివేది అన్నారు. కేసుల దర్యాప్తు వ్యవహారాన్ని పోలీసులు చూసుకుంటారని తెలిపారు. ఫారం-7 దుర్వినియోగంపై ఏర్పాటైన సిట్, రాష్ట్రంలో ఎన్నికల సన్నాహాలపై శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఫారం-7 ద్వారా ప్రత్యర్థుల ఓట్లు తొలగించాలని చేసే ప్రక్రియ తొలిసారిగా గుర్తించామన్నారు. గతంలో ఈ పరిస్థితి లేదన్నారు. ఎన్నికల సిబ్బంది ఎక్కువ సమయం ఫారం-7 పరిశీలనకే కేటాయించాల్సి వస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా, సజావుగా సాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ద్వివేది చెప్పారు. రెండు హెలికాప్టర్లు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు. మావోయిస్టు ప్రభావిత, అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో వీటి ద్వారా పర్యవేక్షిస్తామని చెప్పారు. ఈవీఎంలు మొరాయిస్తే పోలింగ్‌కు ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో 20 శాతం అదనంగా ఈవీఎంలను అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- జయలలితగా రమ్యకృష్ణను చూశారా?
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- ‘అతను నన్ను చంపాలని చూస్తున్నాడు’
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- రణ్‌బీర్‌కు ఆలియా అప్పుడే తెలుసు..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- కేంద్రానిది తొందరపాటు నిర్ణయం:మాయావతి
- భయం.. కోపం రెండూ వస్తున్నాయి!
- భారీ ప్రక్షాళనకు కార్యాచరణ
- అలాంటివాటిపై దృష్టి సారిస్తే నష్టమే:మమత
ఎక్కువ మంది చదివినవి (Most Read)
