Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102794
            [news_title_telugu_html] => 

నా కుటుంబంలో 9 ఓట్లున్నాయి.. కానీ..

[news_title_telugu] => నా కుటుంబంలో 9 ఓట్లున్నాయి.. కానీ.. [news_title_english] => Nine people in my family but I got just five [news_short_description] => పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఓ కౌటింగ్‌ కేంద్రం నుంచి ఓ అభ్యర్థి బయటకు వచ్చి మీడియా ముందు బోరున విలపించిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పేరు నీతూ [news_tags_keywords] => [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 18:46:04 [news_isactive] => 1 [news_status] => 2 ) )
నా కుటుంబంలో 9 ఓట్లున్నాయి.. కానీ.. - Nine people in my family but I got just five - EENADU
close

తాజా వార్తలు

నా కుటుంబంలో 9 ఓట్లున్నాయి.. కానీ..

తనకు 5 ఓట్లే పడ్డాయని బోరున విలపించిన అభ్యర్థి

జలంధర్‌: పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న ఓ కౌటింగ్‌ కేంద్రం నుంచి ఓ అభ్యర్థి బయటకు వచ్చి మీడియా ముందు బోరున విలపించిన ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది. ఆయన పేరు నీతూ షట్టెరన్‌వాలా. ఆ ప్రాంతంలో ఆయన చిన్న వ్యాపారం చేస్తుంటారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. కౌంటింగ్‌ కేంద్రం నుంచి గురువారం మధ్యాహ్నం ఆయన బయటకు వచ్చి ఏడుస్తూ మాట్లాడిన మాటలను స్థానిక టీవీ ఛానెళ్లన్నీ ప్రసారం చేశాయి. సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్‌ అయ్యాయి. కౌంటింగ్‌ ఇంకా పూర్తి కాకుండానే ఆయన తన బాధనంతా వెళ్లగక్కారు.

‘నా కుటుంబంలో తొమ్మిది మంది ఓటర్లు ఉన్నారు. కానీ, నాకు కేవలం ఐదు ఓట్లు మాత్రమే పడ్డాయి. నాకు విస్మయం కలిగించిన విషయం ఇది. నా వీధిలో వారంతా నాకే ఓట్లు వేస్తామని చెప్పారు.. కానీ, నాకు ఐదు ఓట్లు మాత్రమే వచ్చాయి. నేను నెల రోజులుగా నా దుకాణాన్ని విడిచిపెట్టి ప్రజలతో కలిసి పనిచేశాను. అయినప్పటికీ వారు నాకు ఓట్లు వేయలేదు. నేను ఇక భవిష్యత్తుల్లో ఎన్నడూ ఎన్నికల్లో పోటీ చేయను’ అని నీతూ బోరున విలపిస్తూ చెప్పారు. మరోవైపు, గురువారం సాయంత్రం కౌంటింగ్‌ పూర్తయ్యే నాటికి ఆయనకు మొత్తం 856 ఓట్లు వచ్చాయి.    


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.