Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 114643
            [news_title_telugu_html] => వాస్తవాలను దాస్తున్నారు: భట్టి
            [news_title_telugu] => వాస్తవాలను దాస్తున్నారు: భట్టి
            [news_title_english] => congress leader bhatti pressmeet
            [news_short_description] => కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఉదయం దిల్లీలో ఆయన మీడియాతో...

            [news_tags_keywords] => congress,bhatti,ts politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => ||
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-06-20 11:30:07
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
వాస్తవాలను దాస్తున్నారు: భట్టి - congress leader bhatti pressmeet - EENADU
close

తాజా వార్తలు

వాస్తవాలను దాస్తున్నారు: భట్టి

దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టుపై తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. గురువారం ఉదయం దిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టు డీపీఆర్‌ను ప్రజలకు అందుబాటులో ఉంచాలని కోరితే ఇంతవరకు బయటపెట్టలేదన్నారు. ప్రాజెక్టు సమగ్ర సమాచారం వెబ్‌సైట్‌లో పెట్టాలని డిమాండ్‌ చేశారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని ఆధారాలతో సహా బయటపెట్టామన్నారు. 15 శాతం నిర్మాణానికే రూ.50 వేల కోట్లు ఖర్చయితే మొత్తం ప్రాజెక్టు పూర్తికావడానికి ఎన్ని లక్షల కోట్లు కావాలని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై వాస్తవాలను దాచే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విపక్షాల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పకుండా విశ్రాంత ఉద్యోగులతో మాట్లాడిస్తోందని పేర్కొన్నారు. ‘‘15 శాతం నిర్మాణం పూర్తికాని ప్రాజెక్టును హడావుడిగా ప్రారంభిస్తూ రాష్ట్రానికి భారంగా మారుస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 70 శాతం పూర్తయిన ప్రాజెక్టులకు అడ్డుపడి తెలంగాణ ప్రాంతానికి గోదావరి నీళ్లు రాకుండా చేసింది కేసీఆరే. తెలంగాణ ప్రాజెక్టు కోసం ఏం త్యాగం చేశారని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను పిలిచారు.

. తెలంగాణ ఖజానాపై ఆర్థికభారం పడేలా వ్యవహరించిన వ్యక్తి  ఫడణవీస్‌. నిజాలు బయటికి వస్తాయనే ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన అన్ని పార్టీలను పిలవలేదు. రేపు ఉదయం ప్రారంభోత్సవం చేసిన తర్వాత మీరు చెప్పిన 18లక్షల ఎకరాల్లో కనీసం లక్ష ఎకరాలకైనా నీరు ఇస్తారా?’’ అని భట్టి ప్రశ్నించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.