Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146235
            [news_title_telugu_html] => 

అవినీతి విప్లవానికి కాంగ్రెస్‌ యత్నం: నఖ్వీ

[news_title_telugu] => అవినీతి విప్లవానికి కాంగ్రెస్‌ యత్నం: నఖ్వీ [news_title_english] => Congress Trying To Convert Corruption To Revolution says Naqvi [news_short_description] => ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అరెస్టు వ్యవహారంపై కాంగ్రెస్‌ అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తప్పుబట్టారు...... [news_tags_keywords] => Chidambaram Arrest,Congress,Mukhtar Abbas Naqvi,politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 23:38:11 [news_isactive] => 1 [news_status] => 2 ) )
అవినీతి విప్లవానికి కాంగ్రెస్‌ యత్నం: నఖ్వీ - Congress Trying To Convert Corruption To Revolution says Naqvi - EENADU
close

తాజా వార్తలు

అవినీతి విప్లవానికి కాంగ్రెస్‌ యత్నం: నఖ్వీ

దిల్లీ: ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో చిదంబరం అరెస్టు వ్యవహారంపై కాంగ్రెస్‌ నేతలు అనుసరిస్తున్న తీరుపై కేంద్రమంత్రి, భాజపా సీనియర్‌ నేత ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ మండిపడ్డారు. చిదంబరం అరెస్టుపై కాంగ్రెస్‌ నేతలు చేస్తోన్న విమర్శలను ఆయన తిప్పికొట్టారు. అవినీతిని ఓ విప్లవంగా మార్చేందుకు కాంగ్రెస్‌ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్ర మాజీ మంత్రి చిదంబరాన్ని హైడ్రామా మధ్య నిన్న రాత్రి సీబీఐ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో కాంగ్రెస్‌ నేతలు ఆయనకు సంఘీభావం తెలపడంతో పాటు కేంద్ర ప్రభుత్వం కక్షపూరిత విధానాల్లో భాగంగానే అరెస్టులు చేయిస్తోందని.. ఇందుకోసం దర్యాప్తు సంస్థలను పావుగా వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో నఖ్వీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నేతలు ప్రతికూల ఆలోచనలతో పనిచేస్తున్నారని విమర్శించారు. అవినీతిని విప్లవంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతుండటం ఇదే తొలిసారన్నారు. ఇప్పటిదాకా అవినీతికి వ్యతిరేకంగా పోరాటాలు జరుగుతున్నాయని.. కానీ కాంగ్రెస్‌ నేతలు అవినీతికి మద్దతుగా విప్లవం తేవాలని ప్రయత్నం చేస్తున్నారంటూ నఖ్వీ ధ్వజమెత్తారు. దర్యాప్తు సంస్థలు, న్యాయస్థానాలు తమ పని తాము చేసుకుంటుంటే.. కాంగ్రెస్‌ నేతలు మాత్రం అవినీతిని విప్లవంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.