Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146715
            [news_title_telugu_html] => 

రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్‌ ప్రమాణం

[news_title_telugu] => రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్‌ ప్రమాణం [news_title_english] => Manmohan Singh takes oath as Rajya Sabha member from Rajasthan [news_short_description] => కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. మన్మోహన్‌........ [news_tags_keywords] => manmohan singh,Rajya Sabha,mp,congress party [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => waswHvWZ42E [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 13:30:29 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్‌ ప్రమాణం - Manmohan Singh takes oath as Rajya Sabha member from Rajasthan - EENADU
close

తాజా వార్తలు

రాజ్యసభ సభ్యునిగా మన్మోహన్‌ ప్రమాణం

దిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సమక్షంలో ఆయన ప్రమాణం చేశారు. మన్మోహన్‌ రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేయగా... గడువు ముగిసేలోపు ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు మన్మోహన్‌ రాజ్యసభ సభ్యునిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, గులామ్‌ నబీ అజాద్‌ తదితర సీనియర్‌ నేతలు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
కాంగ్రెస్‌ పార్టీ ఆయన పేరును రాజ్యసభకు ప్రతిపాదించగా.. భారతీయ జనతా పార్టీ ఎవరినీ బరిలోకి దింపలేదు. భాజపాకు చెందిన రాజ్యసభ సభ్యుడు మదన్‌లాల్‌ సైనీ అకాల మరణంతో ఈ స్థానానికి ఉపఎన్నిక జరిగింది. గత మూడు దశాబ్దాలుగా మన్మోహన్‌ అసోం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. అయితే, అసోంలో కాంగ్రెస్‌కు సంఖ్యాబలం లేకపోవడంతో ఈసారి రాజస్థాన్‌ నుంచి మన్మోహన్‌ పెద్దల సభకు వెళ్లారు. 1991 నుంచి 2019 వరకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. ఈ ఏడాది జూన్‌ 14 ఆయన పదవీకాలం పూర్తయింది. ఈ ఎన్నికతో 2024 ఏప్రిల్‌ 3 వరకూ ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతారు. మన్మోహన్‌ 2004 నుంచి 2014 వరకు ప్రధాన మంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.