Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000612
            [news_title_telugu_html] => 

కేంద్రం చర్యలు మంచివే.. అయితే మరిన్ని కావాలి!

[news_title_telugu] => కేంద్రం చర్యలు మంచివే.. అయితే మరిన్ని కావాలి! [news_title_english] => Steps Taken By Centre To Deal With Recession Not Enough says Mayawati [news_short_description] => ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం దృష్ట్యా కేంద్రం చేపట్టిన చర్యలు మంచివేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అయితే, ఆ చర్యలు...... [news_tags_keywords] => Mayawati,Recession ,BSP [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-24 23:50:05 [news_isactive] => 1 [news_status] => 2 ) )
కేంద్రం చర్యలు మంచివే.. అయితే మరిన్ని కావాలి! - Steps Taken By Centre To Deal With Recession Not Enough says Mayawati - EENADU
close

తాజా వార్తలు

కేంద్రం చర్యలు మంచివే.. అయితే మరిన్ని కావాలి!


లఖ్‌నవూ: ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో దేశంలో నెలకొన్న ఆర్థిక మందగమనం దృష్ట్యా కేంద్రం చేపట్టిన చర్యలు మంచివేనని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అయితే, ఆ చర్యలు మాత్రమే సరిపోవని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా కేంద్రం నిన్న ప్రకటించిన పలు నిర్ణయాలపై ఆమె ట్విటర్‌లో స్పందించారు. దేశంలో కోట్లాది మంది ప్రజల్ని తీవ్రమైన ఆకలి, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, ఒత్తిడి సమస్య నుంచి బయటపడేలా కేంద్రం సత్వర చర్యలు చేపట్టాలని ఆగస్టు 18న తమ పార్టీ కేంద్రాన్ని డిమాండ్‌ చేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం చేపట్టిన చర్యలు మంచివే అయినప్పటికీ ఇంకా సరిపోవని అభిప్రాయపడ్డారు. అయితే, దీంతోనే కేంద్రం ఈ చర్యలతోనే సరిపెట్టుకోకూడదన్నారు. 

తీవ్రమైన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తదితర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఓవైపున నిరుద్యోగం, పేదరికం, ధరల పెరుగుదల, నిరక్షరాస్యత, హింసాత్మక ఘటనలతో పాటు తాజాగా ఆర్థిక మాంద్యం దేశ ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోందన్నారు. దేశంలో నెలకొన్న పరిస్థితితో వ్యాపార వర్గాలన్నీ తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయన్నారు. మరోవైపు, కొలువులకు కోత పడటంతో ఆత్మహత్య ఘటనలు చోటుచేసుకుంటున్నాయని మాయావతి తెలిపారు. ఈ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం సత్వరమే దృష్టి పెట్టాలని కోరారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.