
తాజా వార్తలు
దిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) భద్రతా దళానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆ సంస్థ చీఫ్ అయిన అరుణ్ సిన్హాకు లేఖ రాశారు. అంకిత భావం, విచక్షణతో సుదీర్ఘ కాలం పాటు తమ కుటుంబ భద్రత కోసం సేవలందించినందుకు ప్రశంసించారు. ‘‘ఎస్పీజీని కేటాయించినప్పటి నుంచి మా కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంది. వారి పర్యవేక్షణలో మాకు పూర్తి భద్రత భావం కలిగింది. ఎస్పీజీ మా వెంటే ఉండడం వల్ల గత 28 ఏళ్లుగా మేం ప్రతి రోజూ పూర్తి నిబద్ధతతో మా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాం. ఎస్పీజీ అనేది ఒక అద్భుతమైన దళం. ఇందులోని సైనికులకు దేశభక్తితోపాటు, ఇచ్చిన పనిని కచ్చితంగా నిర్వర్తించే సామర్థ్యం ఉంటుంది. ఇలాంటి నిబద్ధతతో మా కుటుంబాన్ని ఇంత కాలం సంరక్షించినందుకు వారిని ప్రశంసిస్తున్నాను.’’ అని లేఖలో పేర్కొన్నారు.
నాయకులకు కేటాయించే వ్యక్తిగత భద్రతపై ఐదేళ్లకోసారి జరిగే సమీక్షలో భాగంగా గాంధీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఎస్పీజీ భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల నుంచి సోనియా గాంధీ కుటుంబంలోని రాహుల్, ప్రియాంకలకు దేశంలోని అత్యున్నత స్థాయి భద్రతా దళం ఎస్పీజీ సెక్యురిటీగా ఉంటోంది. 1991లో సోనియా గాంధీ భర్త, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య ఘటన తర్వాతి నుంచి వీరి కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కేటాయించారు. ఇక నుంచి ఈ కుటుంబానికి జడ్ ప్లస్ కేటగిరీ సెక్యురిటీ వర్తించనుంది. ఇందులో భాగంగా సుమారు 100 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు గాంధీ కుటుంబానికి భద్రతా సిబ్బందిగా ఉండనున్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఏపీ సచివాలయం వద్ద డ్రోన్ కలకలం..
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- 8 మంది.. 8 గంటలు
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- ఆనమ్ మీర్జా మెహందీ వేడుకలో సానియా తళుకులు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
