
తాజా వార్తలు
అమేఠీ: కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దాఖలు చేసిన నామినేషన్ చెల్లుబాటు అవుతుందని అమేఠీ రిటర్నింగ్ అధికారి సోమవారం స్పష్టం చేశారు. ఆయన ఎన్నికల ప్రక్రియకు దూరం కావొచ్చనే ఊహాగానాలకు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటనతో తెరపడింది. రాహుల్ నామినేషన్లో అనేక వ్యత్యాసాలు ఉన్నాయంటూ అమేఠీ ఇండిపెండెంట్ అభ్యర్థి ధ్రువ్ లాల్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దాంతో రిటర్నింగ్ అధికారి వాటి పరిశీలనను ఏప్రిల్ 22కు వాయిదా వేశారు.
కాంగ్రెస్ అధ్యక్షుడి పేరు, పౌరసత్వం, విద్యార్హత మీద ధ్రువ్ లాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయాల్లో స్పష్టత వచ్చేవరకు ఆయన నామినేషన్ స్వీకరించవద్దని ధ్రువ్ తరఫు న్యాయవాది రిటర్నింగ్ అధికారిని కోరారు. వాటిని పరిశీలించిన ఎన్నికల సంఘం రాహుల్ నామినేషన్ స్వీకరిస్తున్నట్లు ప్రకటించింది. కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో మే 6న ఎన్నికలు జరగనున్నాయి. గత ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అమేఠీలో రాహుల్ ప్రధాన ప్రత్యర్థిగా భాజపా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- ఎన్‌కౌంటర్‌పై హైకోర్టులో అత్యవసర విచారణ
- ఉన్నావ్ ఘటన బాధితురాలు మృతి
- విజృంభించిన విరాట్.. టీమిండియా విజయం
- సచిన్ కుమారుడు ఎందుకు ఆడొద్దు?
- కిర్రాక్ కోహ్లి
- తీర్పు చెప్పిన తూటా
- ఈ అరటిపండు ధర రూ. 85 లక్షలు!
- హక్కులు మనుషులకు.. మృగాళ్లకు కాదు!
- ఆయుధాలు ప్రదర్శనకు కాదు:మీనాక్షి లేఖి
- రజాక్‌కు పఠాన్ చురకలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
