
తాజా వార్తలు
ప్రయాణికుల నుంచి పెరుగుతున్న డిమాండ్
ఈనాడు, హైదరాబాద్
‘మెట్రో వేళల్ని ఎప్పుడు పొడిగిస్తారు? ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో ఉంటే షిఫ్టుల్లో పనిచేసే ఉద్యోగులకు ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది’
- అభిషేక్
మెట్రోకు ప్రయాణికుల నుంచి రోజురోజుకూ ఆదరణ పెరుగుతుంది. రెండు మార్గాల్లో స్పందన బాగుంది. సగటున 2.75 లక్షల మంది నిత్యం రాకపోకలు సాగిస్తున్నారు. ప్రయాణ వేళల్ని పొడిగిస్తే మరింత మందికి మెట్రో చేరువయ్యే అవకాశం ఉంది. వేళల్ని ఉదయం, రాత్రి పెంచాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రో దీనిపై స్పందించడం లేదు. హైటెక్‌సిటీ మెట్రో ప్రారంభమయ్యాక వేళల్ని పొడిగిస్తామని ప్రకటించి నెలలు కావొస్తున్నా ఉలుకూపలుకు లేదు.
హైదరాబాద్ మహానగరం.. అర్ధరాత్రి వరకు మేల్కొనే ఉంటుంది. మళ్లీ ఉదయం 5 గంటల నుంచే ఉరుకులు పరుగులు మొదలు. విద్యార్థులు, ఉద్యోగులు, వేర్వేరు పనుల నిమిత్తం నగరానికి వచ్చేవారు, నగరం నుంచి దూర ప్రాంతాలకు వెళ్లేవారు ఉదయం, రాత్రివేళల్లో సరైన ప్రజారవాణా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెట్రోతో ఈ బాధలు తీరతాయని అనుకుంటే కొంతవరకే ఉపశమనం లభించింది. ఉదయం 6.30 గంటల తర్వాతే మొదటి మెట్రో కూత మొదలవుతుంది. వేర్వేరు స్టేషన్లలో 6.40, 6.50 గంటల వరకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఉదయం ఇలా ఉంటే.. కనీసం రాత్రిపూటైనా అర్ధరాత్రి వరకు నడుపుతున్నారా అంటే అదీ లేదు. 10.30 గంటలకే చివరి మెట్రో వెళ్లిపోతుంది. అమీర్‌పేట ఇంటర్‌ఛేంజ్‌లో మాత్రం 11.02 గంటలకు చివరి మెట్రో వెళుతోంది. ఈ వేళల్ని 12 గంటల వరకైనా పొడిగించాలని మొరపెట్టుకుంటున్నా ఎల్ అండ్ టీ మెట్రో పట్టించుకోవడం లేదు.
నిరుపయోగం.. మెట్రోను... బస్సుస్టేషన్లు, రైల్వేస్టేషన్లకు అనుసంధానంగా నిర్మించినా.. వేళలు పరిమితంగా ఉండటంతో పెద్దగా ఉపయోగం లేకుండా పోయింది. దూరప్రాంతాల నుంచి సికింద్రాబాద్, నాంపల్లి రైల్వే స్టేషన్లలో ఉదయం 5 గంటలకే దిగే ప్రయాణికులు లక్షల్లోనే ఉంటారు. ఎల్బీనగర్, ఎంజీబీఎస్‌లో బస్సుల్లో దిగేవారి సంఖ్య వేలల్లోనే. వీరెవరికీ మెట్రోవేళలు అనుకూలంగా లేవు. సికింద్రాబాద్, నాంపల్లి మెట్రో రైల్వేస్టేషన్ల దగ్గర ఇవే పడిగాపులు. ఇమ్లిబన్లో దిగిన ప్రయాణికులు గమ్యస్థానం చేరుకునేందుకు మెట్రో స్టేషన్ గేట్ల వద్ద ఎప్పుడు తెరుస్తారా అని ఎదురుచూడటం అంటే మెట్రో వేళలు ఎలా ఉన్నాయో అర్థం అవుతోంది.
ప్రయాణికుల ప్రశ్నల పరంపర..
మలక్‌పేట మెట్రోస్టేషన్లో అపరిష్కృత పనులు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఎంఎంటీఎస్ వైపు ప్రవేశమార్గం, పాదబాటల పనులు ఎప్పుడు పూర్తిచేస్తారు? ఈ పనులు చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్నాయి.
- అహ్మద్ ఉద్దీన్
రైల్వేస్టేషన్‌కు సికింద్రాబాద్ ఈస్ట్, వెస్ట్ స్టేషన్ల నుంచి అనుసంధానం ఎప్పుడు పూర్తవుతుంది?
* చైనా, ఇతర ఆధునిక మెట్రోలతో పోలిస్తే మన మెట్రో వేగం చాలా తక్కువ. అత్యాధునిక సాంకేతికతతో నిర్మించలేదా? లేదా అధిక వేగంతో నడిపే సామర్థ్యం డ్రైవర్లకు లేదా?
- రాజ్
బడి పిల్లలకు రాయితీ పాసులు ఎందుకివ్వడం లేదు? త్రైమాసిక పాసులు ఇవ్వడంపై ఆలోచించండి?
- గోపాల్
జనరల్
రాజకీయం
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- శరణార్థులకు పౌరసత్వం
- భాజపాకు తెరాస షాక్!
- హ్యాట్సాఫ్ టు కేసీఆర్: జగన్
- అమ్మ గురుమూర్తీ!
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
