close

తాజా వార్తలు

ఎక్కాలు ఇలా కూడా నేర్చుకోవచ్చా!

వైరల్‌ అవుతోన్న వీడియో

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్నప్పుడు గణితంలో నేర్చుకున్న ఎక్కాలు గుర్తున్నాయి కదా..ఇప్పటికీ కొందరికి వాటి గురించి వింటే కాస్త భయంగా ఉంటుంది. ఎందుకంటే కొందరికి ఈ ఎక్కాలు ఓ పట్టాన ఎక్కవు. భవిష్యత్తులో గణితంలో రాణించాలంటే ఈ ఎక్కాలు కీలకమాయే! అందుకేనేమో పిల్లలకి స్మార్ట్‌గా వీటిని నేర్పించాలని ఓ ఉపాధ్యాయుడు వినూత్న విధానాన్ని కనిపెట్టాడు. ఏ పాఠశాల ఈ పద్ధతిని అనుసరిస్తోందో గానీ ఆటపాటలతో ఎక్కాలు నేర్చుకునే విధానం మాత్రం అద్భుతంగా ఉంది. ఎందుకంటే చిన్నపిల్లలకు పాఠాల రూపంలో చెప్పడం కంటే ఆటపాటల రూపంలో చెప్తేనే ఆసక్తిగా నేర్చుకుంటారు. గుర్తు పెట్టుకుంటారు కూడా. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఈ పద్ధతిని అనుసరిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్‌ అవుతోంది. ‘ఎక్కాలు ఇలా కూడా నేర్చుకోవచ్చా’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారో మీరు కూడా చూసేయండి!
 

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.