close

తాజా వార్తలు

కారం పొడి చల్లి రూ.లక్ష దోపిడీ

ముగ్గురి అరెస్టు

పెరియపాళ్యం: రెడ్‌హిల్స్‌ సమీపంలో ద్విచక్ర వాహనంలో వెళుతున్న వ్యక్తిపై కారం పొడి చల్లి రూ.లక్ష దోచుకున్న తెలంగాణకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. గుమ్మిడిపూండి సమీప తురాపళ్లానికి చెందిన పార్తిబన్‌ గురువారం రాత్రి రూ.లక్ష నగదుతో ద్విచక్ర వాహనంపై రెడ్‌హిల్స్‌కు బయలు దేరాడన్నారు. పాడియనల్లూరులో గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు అతనిని అడ్డుకుని కారం పొడి చల్లి రూ.లక్ష నగదుతో పారిపోయినట్లు పార్తిబన్‌ ఫిర్యాదు చేశాడని రెడ్‌హిల్స్‌ సీఐ తమిళళగన్‌ పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టగా తెలంగాణలోని కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన పృధ్వీ, ఆంజనేయులు, గోపి అనే వ్యక్తులు దోపిడీ చేసినట్లు తేలడంతో శనివారం వారిని అరెస్టు చేశామన్నారు. విచారణలో విజయవాడకు చెందిన సందీప్‌ అనే వ్యక్తి అక్కడి ఓ నగల దుకాణంలో పనిచేసేవాడని, ఇతను నెలలో నాలుగుసార్లు నగదుతో చెన్నైకి వచ్చి బంగారు బిస్కెట్లు తీసుకెళ్లేవాడన్నారు. ఇలా తీసుకొచ్చిన రూ.10 లక్షలు కాజేసి దోపిడీ జరిగినట్లు యజమానిని నిమ్మంచాలని సందీప్‌ ప్రణాళిక రచించినట్లు సీఐ చెప్పారు. ఈ విషయాన్ని స్నేహితుడు రాహుల్‌తో చెప్పగా అతను కరీంనగర్‌ ప్రాంతానికి చెందిన పృధ్వీ, గోపి, ఆంజనేయులు, ఆసిఫ్‌, సాగర్‌లను కలవాలని సూచించాడన్నారు. తర్వాత సందీప్‌ వారిని కలిసినట్లు పేర్కొన్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం సందీప్‌ రూ.10 లక్షల నగదుతో చెన్నై రాగా చేరుకోగా అతనిపై కారం పొడి చల్లి నగదు దోచుకోవాలని, తర్వాత ఆ మొత్తాన్ని ఏడుగురు పంచుకోవాలని నిర్ణయించారన్నారు. గురువారం రాత్రి రూ.10 లక్షల నగదుతో సందీప్‌ విజయవాడ నుంచి ప్రైవేటు బస్సులో చెన్నై బయలుదేరాడని, పృధ్వీ, గోపి, ఆంజనేయులు ఒక ద్విచక్ర వాహనంపై, ఆసిఫ్‌, సాగర్‌ మరో ద్విచక్ర వాహనంపై బస్సును వెంబడించారని సీఐ వివరించారు. కావలిలో పెట్రోలు అయిపోవడంతో ఆసిఫ్‌, సాగర్‌ అక్కడే ఆగిపోయారని, రెడ్‌హిల్స్‌ సమీపంలోని పాడియనల్లూరు వద్దకు వచ్చేసరికి పృధ్వీ, గోపి, ఆంజనేయులు వచ్చిన వాహనంలోనూ పెట్రోలు అయిపోయిందన్నారు. శుక్రవారం ఉదయం సందీప్‌ చెన్నైలోని మాధవరం బస్టాండుకు చేరుకుని పృధ్వీకి ఫోన్‌ చేయగా స్విచ్ఛాప్‌ చేసి ఉందని, అనుకున్నట్లు జరగకపోవడంతో నిరాశతో సందీప్‌ బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసుకుని విజయవాడకు వెళ్లిపోయాడన్నారు. పెట్రోలు పోసుకోవడానికి డబ్బులు లేక అవస్థలు పడిన పృధ్వీ తదితరులు పాడినల్లూరులో దిచక్ర వాహనంపై వెళ్తున్న పార్తిబన్‌పై కారం పొడి చల్లి రూ.లక్ష నగదును దోచుకుని పారిపోయినట్లు విచారణలో తేలిందన్నారు. శనివారం ఉదయం వారిని అరెస్టు చేశామన్నారు. పృధ్వీ, గోపి, ఆంజనేయులను తిరువొత్తియూరు కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలు తరలించామని సీఐ చెప్పారు.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.