close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. చంద్రయాన్‌ 2 ప్రయోగం విజయవంతం

భారత అంతరిక్ష చరిత్రలో మరో అద్భుతమైన ఘట్టం ఆవిష్కృతమైంది. జాబిల్లిపై పరిశోధనల కోసం చంద్రయాన్‌ 2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట నుంచి విజయవంతంగా ప్రయోగించింది. 20గంటల కౌంట్‌ డౌన్‌ అనంతరం 3.8 టన్నుల బరువైన చంద్రయాన్‌ 2 ఉపగ్రహంతో మధ్యాహ్నం 2.43 నిమిషాలకు నింగికెగసిన జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 వాహకనౌక(రాకెట్‌)  16 నిమిషాల 13 సెకెండ్ల పాటు ప్రయాణించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘ఇదే మా తొలి 50రోజుల రిపోర్టు కార్డు’ 

భాజపా నేతృత్వంలోని ఎన్డీయే రెండోసారి అధికారంలోకి వచ్చి జులై 20 నాటికి 50 రోజులు పూర్తయింది. అఖండ విజయాన్ని సొంత చేసుకున్న భాజపా తొలి యాభై రోజుల్లో వేసిన అడుగులను వివరిస్తూ సోమవారం రిపోర్టు కార్డు విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు అభివృద్ధిని పరుగులు పెట్టించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వచ్చే 45 రోజులు అత్యంత కీలకం: ఇస్రో ఛైర్మన్‌

శాస్త్ర సాంకేతిక రంగంలో భారత్‌ను ఉన్నతంగా ఉంచడమే తమ లక్ష్యమని ఇస్రో ఛైర్మన్‌ శివన్‌ అన్నారు. చంద్రయాన్‌-2 ప్రయోగం అనంతరం శివన్‌ మాట్లాడారు. ఇప్పటికి రాకెట్‌ను విజయవంతంగా నింగిలోకి పంపామన్నారు. అసలు ప్రయోగం ఇప్పుడు ప్రారంభమవుతుందని చెప్పారు. మార్క్‌-3 విజయం కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. చంద్రయాన్‌-2లో ఇది ఆరంభం మాత్రమేనని చెప్పారు. వచ్చే 45 రోజులు తమకు అత్యంత కీలకమని.. సెప్టెంబర్‌ 7న రాత్రి ల్యాండర్ చంద్రుడిపై దిగిన తర్వాత యాత్ర పూర్తవుతుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. చింతమడక వాసులకు కేసీఆర్‌ వరాల జల్లు

తన స్వగ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ గ్రామస్తులపై వరాల జల్లు కురిపించారు. సిద్దిపేటలోని చింతమడకకు చేరుకున్న ఆయన తొలుత గ్రామంలోని శివాలయం, రామాలయం, గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐక్యంగా కదలాలన్నారు. నెలరోజుల్లో చింతమడక గ్రామంలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల లబ్ధి చేకూరుస్తామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎస్సై ఫలితాలను విడుదల చేసిన సీఎం జగన్‌

ఏపీ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్వహించిన ఎస్సై పరీక్ష ఫలితాలను ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి విడుదల చేశారు. అసెంబ్లీ ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో  హోంశాఖ మంత్రి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఛైర్మన్‌ కుమార్‌ విశ్వజిత్‌ తదితరులు పాల్గొన్నారు. ఎస్సై సివిల్‌, డిప్యూటీ జైలర్‌ ఉద్యోగాలకు 15,409 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఆర్‌ఎస్‌ఐ, ఏపీఎస్పీ పోస్టులకు 12,934 మంది, స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్లకు 14,823 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. చంద్రయాన్‌-2 ప్రయోగం వీక్షించండి

7. ఇరాన్‌లోని యూఎస్‌ గూఢచారులకు ఉరి!

అమెరికాకు చెందిన గూఢచారి సంస్థ సీఐఏ తరఫున పనిచేస్తోన్న 17 మంది సభ్యులను ఇరాన్ అదుపులోకి తీసుకున్నట్లు సోమవారం అక్కడి మీడియా వెల్లడించింది. వారిలో కొందరికి ఉరిశిక్ష కూడా విధించినట్లు  తెలిపింది. సీఐఏ తరఫును గూఢచర్యం చేస్తోన్న 17 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు ఇరాన్ ఇంటిలిజెన్స్‌ విభాగం వెల్లడించినట్లు ఫార్స్‌ న్యూస్‌ ఏజెన్సీ పేర్కొంది. అరెస్టు అయిన వారిలో కొందరికి ఉరిశిక్ష పడినట్లు అధికారులు పేర్కొన్నట్లు వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ముంబయిలో భారీ అగ్ని ప్రమాదం

ముంబయిలోని బాంద్రా ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎంటీఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ కార్యాలయ భవనంలో ఈ ప్రమాదం జరిగింది. 9 అంతస్తులున్న ఈ భవనంలో 3,4 అంతస్తుల్లో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. సుమారు 100 మందికి పైగా కార్యాలయ సిబ్బంది భవనం డాబాపై చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 14 అగ్నిమాపక వాహనాలు ప్రస్తుతం ఘటనా స్థలిలో మంటలార్పుతున్నాయి. పూర్తి వార్త కోసం చేయండి

9. ఎస్‌బీఐ నెట్‌బ్యాంకింగ్‌కు అంతరాయం

భారతీయ స్టేట్‌ బ్యాంకు అంతర్జాల లావాదేవీల సేవలకు అంతరాయం కలిగింది. సోమవారం ఉదయం నుంచి పనిచేయట్లేదని వినియోగదారులు ట్విట్టర్‌ ద్వారా ఎస్‌బీఐకు ఫిర్యాదులు పంపుతున్నారు. స్మార్ట్‌ ఫోన్‌లలో ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సేవలకు ఉపయోగించే యోనో యాప్‌ కూడా పనిచేయటంలేదు. ఈ అంతరాయాలకు సంబంధించి బ్యాంకు వర్గాలు ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు

నేడు దేశీయ స్టాక్‌ మార్కెట్లు భారీ నష్ట్లాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 323 పాయింట్లు నష్టపోయి 38,013 వద్ద, నిఫ్టీ 72 పాయింట్లు నష్టపోయి 11,346 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి. నిఫ్టీ రియల్టీ, నిఫ్టీ ఆర్థిక సేవల సూచీలు 0.2శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఫార్మా, లోహరంగ సూచీలు 1శాతం లాభపడ్డాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్‌ ఫిన్‌ సర్వీస్‌, హిందూస్థాన్‌ యూనీలీవర్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌లు అత్యధికంగా నష్టపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.