close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 1PM

1. ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేల సస్పెన్షన్‌

ఏపీ బడ్జెట్‌ సమావేశాల్లో భాగంగా మంగళవారం శాసనసభ వాడివేడిగా ప్రారంభమైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు 45 ఏళ్లకే పింఛను విషయంలో తలెత్తిన ప్రశ్న కారణంగా ముగ్గురు తెదేపా ఎమ్మెల్యేలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో వైకాపా ఎన్నికల హామీపై స్పష్టతకు తెదేపా సభ్యుడు రామానాయుడు డిమాండ్‌ చేశారు. అయితే మేనిఫెస్టోలో అలాంటి హామీ ఇవ్వలేదని పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. సమాధానం చెప్పలేకే సస్పెన్షన్‌: అచ్చెన్న

ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ముగ్గురు ఉపనేతలను సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఆరోపించారు. హామీలు విస్మరిస్తున్నారని సభలో ప్రశ్నిస్తే సస్పెండ్‌ చేస్తారా?అని ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మాట్లాడుతూ.. తన స్థానం నుంచి కదల్లేదని..ఎవరితోనూ దుర్భాషలాడలేదని అన్నారు. 45 ఏళ్లకే పింఛన్‌ ఇస్తానని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారని, దానిని విస్మరిస్తున్నారని చెబితే సస్పెండ్‌ చేస్తారా?అని దుయ్యబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. కొత్త పురపాలక చట్టానికి గవర్నర్‌ ‘నో’!

తెలంగాణ నూతన పురపాలక చట్టానికి సంబంధించిన బిల్లులోని కొన్ని అంశాలపై గవర్నర్‌ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అంశాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేయడంతో..గవర్నర్‌ సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. నాలుగు వారాల గడువు కోరిన అసమ్మతి ఎమ్మెల్యేలు

కర్ణాటక రాజకీయాలు నిమిషానికో మలుపు తిరుగుతున్నాయి. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య సోమవారం వాయిదా పడ్డ సభ.. ఇవాళ ఉదయం ప్రారంభమైంది. మరోవైపు సాయంత్రం 6గంటలకు బలపరీక్ష నిర్వహిస్తానని స్పీకర్‌ స్పష్టం చేశారు. అలాగే రాజీనామా చేసిన 15 మంది ఎమ్మెల్యేలు మంగళవారం తనని కలిసి వివరణ ఇవ్వాలని కోరారు. అయితే అందుకు తమకు మరో 4 వారాల గడువు కావాలని కోరుతూ.. స్పీకర్‌ రమేశ్‌కు మంగళవారం అసమ్మతి ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. స్మిత ఇరవై ఏళ్ల సంగీత ప్రయాణ వేడుక

6. ‘అధ్యక్ష పదవికి ప్రియాంకే సరైన వ్యక్తి’

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహుల్‌ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఆయన సోదరి, కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి మద్దతు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. వరుసగా పార్టీ నాయకులు ఆమెను అధ్యక్షురాలిగా ప్రతిపాదిస్తూ వస్తున్నారు. తాజాగా పార్టీ నేత శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. పార్టీ అత్యున్నత పదవిలో ప్రియాంక గాంధీ అయితే ఒదిగిపోతారని అభిప్రాయపడ్డారు. సోన్‌భద్ర బాధితులను పరామర్శించే విషయంలో ప్రియాంక చూపిన తెగువ ప్రశంసనీయమన్నారు. సమస్యలపై పోరాటంలో ఆమెను మాజీ ప్రధాని ఇందిరాగాంధీతో పోల్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

7. పార్లమెంటును కుదిపేసిన ట్రంప్‌ వ్యాఖ్యలు 

కశ్మీర్‌ అంశంలో మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేకెత్తిస్తున్నాయి. స్వయంగా అగ్రరాజ్య అధ్యక్షుడే స్వయంగా తనని మోదీ మధ్యవర్తిగా ఉండాలని కోరారని చెప్పిన తర్వాత కూడా ప్రధాని ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాయి. ఈ అంశం ఈరోజు పార్లమెంటును సైతం కుదిపేసింది. దీనిపై సమగ్ర చర్చ చేపట్టాలని లోక్‌సభలో కాంగ్రెస్‌, రాజ్యసభలో సీపీఐ నేత డి.రాజా నోటీసులు ఇచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ట్రంప్‌ వ్యాఖ్యలపై అమెరికా నష్టనివారణ చర్యలు!

కశ్మీరు సమస్య పరిష్కారం కోసం భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆ దేశం దిద్దుబాటు చర్యలకు దిగింది. కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా స్వాగతిస్తుందన్నారు. అయితే అమెరికా కేవలం ఈ విషయంలో సహకారం మాత్రమే అందిస్తుందని చెప్పుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. స్వల్ప లాభాల్లో స్టాక్‌మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో కొనసాగుతున్నాయి. ఒంటిగంట సమయానికి సెన్సెక్స్‌ 10, నిఫ్టీ 3 పాయింట్ల లాభంతో ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 68.97గా ఉంది. 

10. ఫ్రెంచ్‌ నోట తెలుగు మాట...!


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.