Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 133402
            [news_title_telugu_html] => 

పల్లమెరిగిన నీరు... పట్టుదలతో వారు!

[news_title_telugu] => పల్లమెరిగిన నీరు... పట్టుదలతో వారు! [news_title_english] => [news_short_description] => వానపడితే చాలు కొండపై నుంచి నీరు జలజలా కిందికి వస్తుంటే ఎంత అందం... ఆనందం కదా? వాళ్లు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదించేవారు... కానీ ఆ నీరు ఎదురుగా ఉన్న సముద్రంలోకి వెళ్లిపోతుంటే మాత్రం బాధ కలిగేది. [news_tags_keywords] => visakhapatnam, sea, water saving, vahrehvah special page [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-29 01:13:28 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పల్లమెరిగిన నీరు... పట్టుదలతో వారు! - EENADU
close

తాజా వార్తలు

పల్లమెరిగిన నీరు... పట్టుదలతో వారు!

వానపడితే చాలు కొండపై నుంచి నీరు జలజలా కిందికి వస్తుంటే ఎంత అందం... ఆనందం కదా?వాళ్లు కూడా ఆ ఆనందాన్ని ఆస్వాదించేవారు... కానీ ఆ నీరు ఎదురుగా ఉన్న సముద్రంలోకి వెళ్లిపోతుంటే మాత్రం బాధ కలిగేది. ఆ బాధ నుంచే ఆలోచన పుట్టింది... అది అందరి కర్తవ్యంగా మారింది. ఇప్పుడు జలజలారావాలు కాస్తా వారికి జలజయధ్వానాలుగా మారాయి...

ఎక్కడ
విశాఖపట్నంలోని జేఆర్‌ నగర్‌ కాలనీ. 1500 మంది ఉంటారక్కడ.

అయితే...
దేశంలోని అన్ని ప్రాంతాల్లోలాగే విశాఖ నగరంలో కూడా నీటి కోసం కోటి తిప్పలు తప్పడం లేదు. గత ఏడాది 40 అడుగుల్లో భూగర్భ జలాలు ఉన్నచోట ఈ ఏడాది మూడొందల అడుగులు తవ్వినా నీరు పడడం లేదు. చాలా కాలనీలకు, అపార్ట్‌మెంట్లకు ట్యాంకర్లే దిక్కు. కానీ జేఆర్‌నగర్‌లో మాత్రం భిన్నమైన పరిస్థితులున్నాయి. వారు కొన్నేళ్ల క్రితం చేసిన ఆలోచనలతో ఇప్పుడా కాలనీ భూగర్భం జలాలతో కళకళలాడుతోంది. వారి ప్రయత్నానికి జాతీయ స్థాయిలో పేరు వచ్చేసింది. రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ విభాగంలో ఈ కాలనీ దేశంలోనే మూడో స్థానంలో నిలిచి కేంద్ర ప్రభుత్వ అవార్డు గెలుచుకుంది.

ఇలా సాధ్యమైంది...
చాలా కాలనీల్లో ఇళ్లే కాదు... మనసులూ దూరమే. అపార్టుమెంట్లలో పలకరింపులూ మొక్కుబడే. కానీ ఆ కాలనీలో మాత్రం అందరికీ ఒక లక్ష్యముంది. ఎవరి ప్రాధాన్యాలు వారికున్నా ఒక విషయంలో మాత్రం అక్కడి వారందరిదీ ఒకటే మాట... ఒకటే బాట. అదే జల సంరక్షణ. ఈ కాలనీ కొండ వాలు ప్రాంతంలో ఉంటుంది. దీంతో పైన కురిసిన వర్షం అంతా కాలనీలోకి ప్రవహిస్తుంది. చూస్తుండగానే అంతనీరూ మురుగు కాలువల ద్వారా సముద్రంలోకి వెళ్లిపోయేది. డబ్బులు బ్యాంకుల్లో, నీటిని భూగర్భంలో దాచుకోపోతే భవిష్యత్తు ఉండదని గ్రహించిన వారందరినీ ఇది కదిలించింది.. అందరూ ఒక్కటై నీరు ఇంకించే చర్యలకు ఉపక్రమించారు.

ఏం చేశారంటే
ముందు కాలనీలో వర్షపు నీరు ప్రవహించి కాలువల్లో కలిసిపోయే ఔట్‌లెట్‌ పాయింట్లను గుర్తించారు. ఎక్కడికక్కడే నీరు ఇంకేలా చేస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని భావించిన వీరు దానికి తగ్గట్లే ప్రణాళికలు వేసుకున్నారు. ఆయా పాయింట్లలో తప్పనిసరిగా ఇంకుడుగుంతలు ఉండేలా చూసుకున్నారు. కాలనీ ముఖద్వారం, కొండవాలు నీరు వచ్చే ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. రెండు, మూడు గుంతలు ఒకే వరసలో ఏర్పాటు చేసుకొని వాటిని ఆనుకొని ప్రవహించే మార్గం ఏర్పాటు చేసుకోవడంతో వాటిలోకి తప్పనిసరిగా నీరు చేరుతోంది. దీంతో చుక్కనీరు కూడా వృథాగా కాలువల్లో కలవడం లేదు. భూగర్భంలోకే చేరుతోంది. దీనికి తోడు ప్రతి అపార్టుమెంటులో ఇంకుడుగుంతలు తప్పనిసరి. అపార్టుమెంటు మేడపై పడ్డ వర్షపు నీరంతా గొట్టాల్లోకి చేరేలా, 8 నుంచి 12 కనెక్షన్ల ద్వారా అనుసంధానించి చివరిగా ఇంకుడుగుంతల్లోకి నీరంతా వెళ్లేలా చేసుకున్నారు. కొత్తగా నిర్మించిన అపార్టుమెంట్లలో అయితే మరింత ఎక్కువ స్థలం జల పరిరక్షణ కోసం వదులుతున్నారు. అందులోనే వివిధ రకాల మొక్కలు నాటారు. గుంతలు తవ్వించారు.

ఫలితం..:  జల సంరక్షణ చర్యల కారణంగా ఈ వేసవిలో విశాఖలోని అన్ని ప్రాంతాల్లో నీటి ఎద్దడి సమస్య ఉత్పన్నమైనా   ఈ కాలనీకి మాత్రం రాలేదు. నగరంలో ఎక్కడ తవ్వినా 200 అడుగుల నుంచి 300 అడుగుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటే ఈ కాలనీలో మాత్రం 70 అడుగుల లోపే నీరు పడుతోంది. శుభ్రత, పచ్చదనంలో నగరంలోనే ఈ కాలనీ ప్రత్యేకంగా కనిపిస్తుంది. వర్షాకాలం వచ్చిందంటే ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తుంది. శుభ్రత విషయంలో ఎవరికి వారు వ్యక్తిగతంగా ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్తకు వేరువేరుగా డబ్బాలు ఏర్పాటు చేసుకొని పారిశుద్ధ్య సిబ్బందికి అందజేయడం ఇక్కడి వారి ప్రత్యేకత. అలాగే వీధులను నిత్యం స్వచ్ఛంగా ఉంచడం, పొడి చెత్తకు ప్రత్యేక కంపోస్టు యూనిట్‌ ఏర్పాటు వంటి చర్యలు తీసుకున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఉత్తమ జల సంరక్షణ, యాజమాన్య పద్ధతులు చేపడుతున్న కాలనీగా దీన్ని గుర్తించింది. కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలో దేశంలో ఒకటి , రెండు స్థానాల్లో బెంగళూర్‌, చెన్నైలకు చెందిన కాలనీలు నిలిస్తే జేఆర్‌నగర్‌ కాలనీకి మూడో స్థానం వచ్చింది.

-సురేష్‌ రావివలస, విశాఖపట్నం


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.